దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఆలియాభట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుంది అనే ఊహాత్మక కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పది భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.




ఇకపోతే ఈ చారిత్రాత్మక సినిమా యొక్క టైటిల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమై 80 శాతం వరకు పూర్తయినప్పటికీ... రాజమౌళి తదుపరి చిత్రం యొక్క శీర్షిక పై స్పష్టత రాకపోవడం గమనార్హం. కొన్ని నెలల క్రితం రామ రావణ రాజ్యం లేదా రఘుపతి రాజారాం అనే రెండు టైటిల్స్ లలో ఏదో ఒకటి పెడుతున్నారనే వార్తలు వెల్లువెత్తాయి కానీ ఇందులో నిజం లేదని తేలింది. ఒకానొక సందర్భంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రబృందం తమ సినిమాకి సరైన టైటిల్ ని సజెస్ట్ చేయమని సామాజిక మాధ్యమాల్లో కోరింది. వారి కోరిక మేరకు బాగానే స్పందన వచ్చింది. కానీ తమ సినిమా యొక్క టైటిల్ గురించి మాత్రం ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 

 

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం... హిందీలో ఈ సినిమాకి రామ్ రావణ్ రాజ్ అనే టైటిల్ అనుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా త్రిపుల్ ఆర్ పూర్తి ఫుల్ ఫామ్ ఇదేనా అనేది తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న కీరవాణి అక్షరాల 16 కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడని సినీ ఇండస్ట్రీ నుండి బలంగా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా 16 కోట్లు తీసుకుంటున్న ఏకైక భారతీయ సంగీత దర్శకుడిగా కీరవాణి రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడని చెప్పుకోవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: