టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ గా వెలుగొందుతున్న బన్నీ సొంత కుంపటి పెట్టే ఆలోచనలో ఉన్నాడా..? చాలా రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతోంది. గతంలో అల్లు ఫ్యామిలీకి అంటూ ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ మారింది. మెగా ఫ్యాన్స్‌ కాకుండా స్పెషల్‌గా అల్లు అర్జున్‌ అభిమాన సంఘం స్పెషల్‌ గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అల్లు అర్జున్‌ ఫ్యామిలికీ మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది.

 

అంతేకాదు అల్లు అర్జున్ సొంతంగా ఓ  నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏఏ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి సొంతంగా సినిమాలు రూపొందించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఇన్నాళ్లు అల్లు అర్జున్‌ కూడా మెగా హీరోనే అన్న భావన ఉండేది. అయితే అభిమానుల్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కోసం బన్నీ కష్టపడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 

ముఖ్యంగా అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఈ ప్రచారం గట్టిగా జరిగింది. ముఖ్యంగా అదే సీజన్‌ లో రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు చిరంజీవి హాజరు కావటంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిందన్న టాక్ బలంగా వినిపించింది, అదే సమయంలో మెగా ఫ్యామిలీకి తగిలే కొన్ని డైలాగ్స్ ఉండటం కూడా ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే బన్నీ మాత్రం బహిరంగంగా తాను ఎప్పటికి చిరంజీవి ఫ్యాన్‌ నే అంటూ చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేశాడు. మరి నిజంగానే బన్నీ సొంత కుంపటి పెడుతున్నాడా లేదా అన్న విషయం తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: