ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅర‌వింద్ రెండొవ కుమారుడు స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌. అల్లుఅర్జున్ సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న‌కంటూ ఒక‌మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. తండ్రికి కుడి, ఎడ‌మ భుజాలు ఆయ‌నే అయ్యారు. అది ఎందుకు అనుకుంటున్నారా. ఆయ‌న ఎన్నో సినిమాల‌ను నిర్మించారు. ఇక తండ్రి బ్యాన‌ర్‌లో వేరే హీరో ఎవ్వ‌రూ న‌టించ‌క‌పోయినా అల్లుఅర్జున్ తండ్రి అండ‌గా నిల‌బ‌డి సినిమా తీయ‌గ‌ల‌డు. అలాగే అల్లుఅర్జున్‌కి ఉన్న క్రేజ్‌కి అల్లుఅర‌వింద్ ఎంత డ‌బ్బులు అయినా స‌రే వెచ్చించి సినిమా తీయ‌గ‌ల‌డు అలా త‌న మూడ‌వ కుమారుడు అల్లు శిరీష్ మీద అంత డ‌బ్బులు పెట్ట‌లేడు. ఎందుకంటే త‌ను న‌టించిన సినిమాలు రెండు ఆశించినంత పెద్ద హిట్ కాలేక‌పోయాయి. త‌న‌కంటూ ఇంకా ఒక మార్కెట్ ఏర్ప‌డ‌లేదు. దాంతో ఆయ‌న ఎక్కువ డ‌బ్బులు పెట్టి శిరీష్ మీద సినిమా తీయ‌లేరు. అలాగే బ‌న్నీ ఇటు ఫ్యామిలీని అలాగే సినిమాల‌ను స‌మానంగా ప్రేమించుకుంటూ వ‌స్తున్నారు. ఇక ఏది వ‌చ్చి మునిగిపోయినా స‌రే అల్లుఅర‌వింద్‌కి ధైర్యంగా అల్లుఅర్జున్ నిల‌బ‌డ‌తాడు. 

 

ఇక ప్ర‌స్తుతం పెట్టిన `ఆహా`వెబ్‌సిరీస్ కూడా అల్లుఅర్జున్ ఓ షూట్ చేయ‌బోతున్నార‌ట‌. దానికోసం కూడా ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డుతున్నారు. దాని ప‌నుల‌న్నీ త్రివిక్ర‌మ్ చూసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇక ఇందులో అల్లుఅర్జున్‌కి జోడిగా కేతిక్ శ‌ర్మ న‌టిస్తోంది. మ‌రి వీరిద్ద‌రి రొమాన్స్ ఏ రేంజ్ లో త్రివిక్ర‌మ్ చూపిస్తాడో వేచి చూడాలి. అలాగే వీరి పిల్ల‌లు ఇద్ద‌రూ ఆర్య‌, అర్హ ఇద్ద‌రూ కూడా అర‌వింద్‌కి చాలా ఇష్టం. ఎందుకంటే శిరీష్‌కి ఇంకా వివాహం జ‌ర‌గ‌లేదు. ఇక పెద్ద కుమారుడు బాబి కూడా ఈమ‌ధ్య కాలంలోనే రెండొవ వివాహం చేసుకున్న విష‌యం తెలిసందే. మరి ఆ ఇంట్లో సంద‌డి చెయ్యాలంటే బ‌న్నీ పిల్ల‌లే ఉన్నారు. నాయ‌న‌మ్మ‌, తాత‌య్య‌ల‌కి బ‌న్నీ పిల్ల‌లు ఎంతో టైమ్‌పాస్ అని చెప్పాలి. అల్లుఅర్జున్ తండ్రికి అండ‌గా నిల‌బ‌డి అన్నీ చూసుకుంటున్నారు. అటు సినిమాల‌ని, ఇటు ఫ్యామిలీని అలాగే త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం విష‌యంలో కాని అన్నిట్లో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: