ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది. ముఖ్యంగా కళా రంగాల్లో ఈ ఆరోపణలు చాలా మంది పై వచ్చాయి. మన దేశంలోనూ పలువురు సినీ ప్రముఖులు మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే కొందరు ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళ స్వయంగా తాము ఎదుర్కొణ భయానక సంఘటనల గురించి వెల్లడించేందుకు ముందుకు వస్తుండటంతో ప్రముఖుల బండారం భయటపడుతోంది.
మీటూ హాలీవుడ్ సంచలనంగా మారిన హార్వీ వెయిన్స్టీన్ భారీ శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. పలువురు హీరోయిన్లను ఇతర సినీ ప్రముఖులపై అత్యాచారం చేయటంతో పాటు లైంగిక వేదించిన కేసలు హర్వీకి 23 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. 67 ఏళ్ల హర్వీ ని లైంగిక నేరాల కింద గత నెలలో అరెస్ట్ చేశారు. విచారణ జరిగి నూయార్క్ సుప్రీం కోర్టు ఫిబ్రవరి 25న హర్వీని నేరస్థుడి నిర్థారించింది.
ఏడుగురు పురుషులు ఐదురుగు మహిళలను ఉన్న సర్వోన్నత న్యాయస్థానం 26 గంటల పాటు సుధీర్ఘంగా జరిపిన విచారణలో వెయిన్స్టీన్ను దోషిగా తేల్చింది. అతను చేసిన రన్ వే ప్రొడక్షన్ అసిస్టెంట్ మిరియం హాలే తో 2006లో అసభ్యంగా ప్రవర్తించటం అభ్యంతరకంగా మాట్లాడిన నేరం తో పాటు 2013లో న్యూయార్క్ లోని ఓ హోటల్ ల ఓ యువతిపై అత్యాచారం చేసిన నేరాలకు గాను హర్వీకి ఈ శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది.