స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్నా కూడా ఏదో వచ్చిన ప్రతి సినిమానీ చెయ్యకుండా .. క్యారెక్టర్ నచ్చితేనే సినిమా చేస్తుంది. అనుష్క.. టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ లో నంబర్ వన్ హీరోయిన్. అందుకే లేట్ అయినా లేటెస్ట్ గా కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. నిశ్శబ్దంగా తనపని తను చేసుకుపోతోంది.

 

గ్లామర్ డాల్ గా టాలీవుడ్ లో ఎంటరయ్యి తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ లకు షాక్  ఇచ్చి..  సౌత్ లో  టాప్ హీరోయిన్ లిస్ట్ లో  చేరిన  హీరోయిన్ అనుష్క. గ్లామర్ రోల్స్ తో పాటు పర్ ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ చేసి తను అందరికన్నా డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు కూడా నిశ్శబ్దం తో తన వర్సెటాలిటీని మరోసారి తెరమీద చూపించబోతోంది. 2018 లో భాగమతి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన అనుష్క..2019 లో సైరాలో గెస్ట్ రోల్ చేసింది. మళ్లీ ఇప్పుడు నిశబ్దం గా ఫుల్ లెన్త్ సినిమాతో రాబోతోంది.

 

హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో మాధవన్, అనుష్క లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సినిమా నిశబ్దం.ఈ సినిమాలో సాక్షి టైటిల్ రోల్ తో పెయింటర్ గా కనిపించబోతోంది స్వీటీ. హర్ ఆర్ట్ స్పీక్స్..బట్ షి కాన్ట్ అంటూ రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించి షార్ట్ హెయిర్ లో పెయింటింగ్ వేస్తున్న అనుష్క అనుష్క లుక్ రిలీజ్ చేసిన దగ్గరనుంచి సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.  ఇక లేటెస్ట్ గా  రిలీజ్ చేసిన ట్రైలర్ తో పీక్స్ కి చేరిపోయాయి అంచనాలు .

 

థ్రిల్లర్ మూవీతో అనుష్క విత్ అవుట్ డైలాగ్, ఎక్స్ ప్రెషన్స్ తోనే యాక్టింగ్ లోని మరో యాంగిల్ ని చూపించబోతోంది. ఇప్పటి వరకూ లౌడ్ డైలాగ్స్ తో థియేటర్లను దడదడలాడించిన అనుష్క.. ఇప్పుడు నిశబ్దంగానే అరిపించబోతోందన్న మాట. ఈ సినిమాలో మూగ అమ్మాయి క్యారెక్టర్ చేస్తున్న అనుష్క.. దీనికోసం టైమ్ తీసకుని స్పెషల్ ట్రెయినింగ్ తీసుకుంది. ఈ సినిమా జనవరి లోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా.. బెటర్ మెంట్ కోసం ఏప్రిల్ వరకూ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఆగి ఆగి వస్తోంది అనుష్క. 

మరింత సమాచారం తెలుసుకోండి: