ఒక మంచి ప్రియుడిగా, వన్ సైడ్ లవర్ గా, బాల్య స్నేహితుడిగా, ప్రాణం ఇచ్చే ఫ్రెండ్ గా, గొప్ప వరుడిగా, మాస్ కేబుల్ రాజుగా, యువకుడిగా, క్షేత్ర పాలకుడిగా, విలువలున్న కొడుకుగా, బ్రాహ్మణుడిగా ఇలా అనేక రకాల పాత్రల్లో నటించాడు హీరో అల్లు అర్జున్. అందరూ మెచ్చుకునే పాత్రల్లో ఎంతో కష్టపడి మంచి నటనని అందిస్తాడు. బన్ని, హ్యాపి, దేశముదురు, పరుగు ఇలా అనేక సినిమాల్లో నటించాడు అల్లు అర్జున్.  

 

 

 


తెలుగు సినిమాల్లో అధిక పాపులారిటీ దక్కించుకున్న వారిలో అల్లు అర్జున్ ఒకడు. ఇంత క్రేజ్ రావడానికి స్టైలిష్ స్టార్ డాన్స్ కూడా ఒక కారణమే. అల్లు అర్జున్ అనేక సినిమాల్లో నటించాడు. గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపి, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు, S/O సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాదం, నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా), అల వైకుంఠపురంలో ఇలా అనేక సినిమాల్లో నటించాడు ఈ హీరో.

 

 

 


గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లుక్స్ బాలేవని ఎంతో మంది నోట విమర్శలు వినిపించాయి. కానీ అల్లు అర్జున్ మంచి లుక్స్ తో మెప్పిస్తూ వచ్చాడు. ప్రతీ సినిమాకి లుక్ మార్చుకుంటూ గ్లామర్ ని మరెంతో పెంచుకుంటూ ఈ హీరో అభిమానుల్ని మెప్పిస్తూ వచ్చాడు బన్ని. తన ఫేస్ లుక్స్ తో పాటు తన ఫిట్నెస్ ని పెంచుకుంటూ వచ్చాడు. డాన్స్ కూడా బాగా అప్డేట్ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చాడు హీరో బన్ని. ఇలా అల్లు అర్జున్ లో గంగోత్రి నుండి అల వైకుంఠపురానికి మధ్య చాలా మార్పు వచ్చింది. మంచిగా ట్యాలెంట్ కూడ ఇంప్రూవ్ చేసుకున్నాడు మన స్టైలిష్ స్టార్ అల్లు వారి అబ్బాయి అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి: