జనసేన అధినేత, పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ కెమరా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ నేషనల్ వైడ్ ట్రెండ్ గా మారింది. అంతే కాకుండా ఫాన్స్ లో మంచి ఉత్సాహాన్ని నింపింది. తాజాగా మహిళా దినోత్సవం రోజు విడుదల చేసిన పాట అభిమానులను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ పాట అభిమానుల నుండి చాలా ఆదరణ పొందింది. అలాగే ఈ చిత్ర టీం మార్చిలోనే టీజర్ రూపంలో మరో అభిమానులకు సప్రైజ్  ఇవ్వాలనుకున్నారు.

 

 

కానీ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ వకీల్ సాబ్ ని కూడా తాకనుంది. ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ వైరస్ తో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఇలానే వరల్డ్ వైడ్ పెరిగితే రానున్న రోజుల్లో థియేటర్స్ మూత పడతాయి. దాంతో నిర్మాతల్లో ఇప్పటికే భయాలు మొదలయ్యి తమ సినిమాలను వాయిదా వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అదే ఆలోచనలో వకీల్ సాబ్ టీం కూడా ఉన్నటు సమాచారం వెలువడుతుంది.

 

 

మొదట ఈ సినిమాను మే 15న రిలీజ్ చేయాలని చిత్రం యూనిట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ను మే నుంచి జూన్ కి వాయిదా వేసే అవకాశం ఉందని చిత్ర టీం చెబుతోంది. అలాగే ఈ నెలలో అనుకున్న ఫస్ట్ టీజర్ కూడా ఆలస్యం చేస్తారని సమాచారం వెలువడుతుంది. చాలా కాలం తర్వాత తమ ఇష్టమైన హీరోని తెరపై చూడాలనుకున్న అభిమానులకి ఇది చేదు వార్త. మరో వైపు ఈ కరోనా ఎఫెక్ట్ మరెన్ని సినిమాలను ఇబ్బందుల్లో పడేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: