స్టైలిష్‌స్టార్‌కి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఎన‌లేని అభిమానం. ఆయ‌న ఎన్నోసార్లు దాని గురించి చెబుతూ ఉంటారు. ఇక డాన్స్ విష‌యంలోగాని ఏ విష‌యంలోనైనా స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ మెగాస్టార్‌ని రోల్‌మోడ‌ల్‌గా తీసుకుంటారు. ఇక డాన్స్‌గాని ఏదైనాగాని ఎక్కువ‌గా అల్లుఅర్జున్ చిరంజీవినే ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుంటానంటారు. ఎక్కువ‌గా ఇన్‌స్పిరేష‌న్ మావ‌య్యేన‌ని ఆయ‌న ప్ర‌తి ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లో చెబుతూనే ఉంటారు. దీనికి రీజ‌న్  మావ‌య్య `డాడి`చిత్రంలో చిరంజీవిగారు ద‌గ్గ‌రుండి ప్ర‌త్యేకించి ఇంట్ర‌స్ట్ తీసుకుని ఆ డాన్స్ చేయించార‌ట‌. దాంతోనే అల్లుఅర్జున్ కెరియ‌ర్ మ‌లుపుతిరిగింది అంటారు. అదేమిటంటే ఆ డాన్స్ చేయించే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు చూసి ఆయ‌న‌కు న‌చ్చి మీ అబ్బాయిని ఫ‌స్ట్ హీరోగా నేనే లాంచ్ చేస్తాను నాకు మాట ఇవ్వ‌మ‌న్నార‌ట అల్లుఅర‌వింద్ ద‌గ్గ‌ర‌కి వెళ్ళి. దాంతో అల్లుఅర‌వింద్ అయ్యే అదేంమాట త‌ప్ప‌కుండా మీరే లాంచ్ చెయ్యండి అన్నార‌ట‌. అలా ఆ విధంగా కె.రాఘ‌వేంద్ర‌రావు బ‌న్నీని `గంగోత్రి` చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు.

 

ఇక చిరంజీవిగారు ఒక మ‌హాచెట్టు ఆయ‌న ఒక బ‌లం. ఆ బ‌లాన్ని మా అంద‌రితో పంచుకున్నారంటూ ఎప్పుడూ బ‌న్నీ చెబుతుంటాడు. న‌న్ను ఫ‌స్ట్ ఇంట్ర‌డ్యూస్ చేసింది చిరంజీవిగారే అలాగే శిరీష్ ఫ‌స్ట్ సినిమా కూడా ఆయ‌నే ఒక‌సారి ఆయ‌న మూవీలో చిన్న బాబు క్యారెక్ట‌ర్ చేశారు. అలా ఆయ‌న ట‌చ్ వ‌ల్లే మేము ఈ రోజు ఇలా ఉన్నాం అని అన్నారు. ఇలా ఎప్పుడు చూసినా మెగాస్టార్ చిరంజీవి గురించి అల్లుఅర్జున్ చెబుతూనే ఉంటారు. అలాగే ఆయ‌నంటే ఎంతో ఇష‌ముండ‌బ‌ట్టి ఆయ‌న త‌న మొద‌టి సినిమాలో ఆయ‌న మీద ఒక పాట‌ను కూడా పెట్టించుకున్నాడు బ‌న్నీ. `మావ‌య్య‌ది మొగ‌లుతుర్రు మానాన్న‌ది పాల‌కొల్లు` మావ‌య్య..మావ‌య్య‌..అహ మావ‌య్య‌ది అని వ‌చ్చే ఆ పాట గంగోత్రిలోనిది అప్ప‌ట్లో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయింది. ఆ పాట వ‌స్తే చాలు చిరంజీవి ఫ్యాన్స్ థియేట‌ర్లో విజిల్స్ మీద విజిల్స్ వేసి మ‌రి ఎంజాయ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: