ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా (కోవిడ్ 19) భయంతో వణికిపోతున్నారు.  సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఈ కరోనా భయం కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ఎప్పుడూ షూటింగ్ బిజీలో ఉండే వారు క్యాన్సల్ చేసుకొని జాగ్రత్తగా ఇంటిపట్టున ఉండే పరిస్థితి నెలకొంది.  ముఖ్యంగా విదేశాల్లో షూటింగ్ జరుపుకునే నటులు అవన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.  ఇక కరోనా మహమ్మారిని ఎలా పోగొట్టాలి.. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ వీడియోలు, ట్విట్టర్ ద్వారా ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.  ఎంత అరికాడుతున్నా ఆ మహమ్మారి మరణాల సంఖ్య తగ్గడం లేదు. దీంతో సాధారణం జనం నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ప్రతి విషయలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.   

 

తాజాగా భారతీయుడు 2 షూటింగ్  ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొని బయట పడ్డ కలువ కళ్ల సుందరి కాజల్ కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్న విషయం తెలిసిందే.  తాజాగా ఈ అమ్మడు కరోనా భయంతో తాను చేసిన పని ఫన్నీగా ట్విట్ చేసింది.  కాజల్ అయితే ఏకంగా ఆల్కహాల్ ని గత మూడురోజులుగా వదలడం లేదట.  అయితే ఆమె డ్రింక్ చేస్తున్నారంటే పోరపాటు.. గత మూడు రోజుల్లో తన చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడిన ఆల్కహాల్ చాలా ఎక్కువని  ట్వీట్ చేసింది. ఎప్పుడైతే కరోనా వ్యాప్తి చెందిందో... అది రాకుండా  ఉండేందుకు చాలామంది ఆల్కహాల్ అధికంగా ఉండే హ్యాండ్ శానిటైజర్స్ ను వాడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో చేతులు కడుక్కోవడానికి వినియోగిస్తోన్న ఆల్కహాల్‌ గురించి కాజల్‌ అలా చమత్కరించింది. అయితే కాజల్ చేసిన ట్విట్ సోషల్ మీడియాలో ఆ వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.  ఇదిలా ఉంటే.. హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ టామ్ హాంక్స్ వైరస్ భారిన పడ్డారు.  ఆస్ట్రేలియాలో ఉంటున్న టామ్ వెంటానే హాస్పటల్ లో చెక్ చేయించుకోగా.. ఆయనకు ఆయన భార్యకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు... ప్రస్తుతం ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: