తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది డైరెక్టర్స్ ఒక్క చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంటారు..రాత్రి రాత్రే టాప్ డైరెక్టర్ల లీస్ట్ లో చేరిపోతుంటారు. మరికొంత మంది డైరెక్టర్స్ సూపర్ హిట్ చిత్రాలు అందించినా.. వరుస డిజాస్టర్స్ ఎదురైతే కంటికి కనిపించకుండా పోతుంటారు.  ఆ మద్య నాని, మెహ్రిన్ జంటగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు  హను రాఘవపూడి  ‘అందాల రాక్షసి’ చిత్రంతో డిజాస్టర్ పొందాడు.  ఈ చిత్రం టాక్ పరంగా బాగున్నా కమర్షియల్ హిట్ మాత్రం కాలేకపోయింది.  హను రాఘవపూడి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా తర్వాత మంచి ఛాన్సులు దక్కించుకున్నాడు.

 

ఇక శర్వానంద్ తో పడి పడి లేచే మనసు తో మరో డిజాస్టర్  పొందాడు.  ఇక మనోడి కెరీర్ ముగిసినట్లే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ లక్కీ మాములూగా లేదు.  ఇప్పుడు బాలీవుడ్ లో ఓ ప్రాజెక్టుని ఫైనల్ చేయించుకున్నట్లు టాక్. భారీ బడ్జెట్ తో రూపొందబోయే ఆ చిత్రం గనక హిట్ అందుకుంటే మనోడిని పట్టుకోవడం కష్టమే అంటున్నారు.   అసలు విషయానికి వస్తే.. హను రాఘవపూడి బాలీవుడ్ లో ఓ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట.  ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీడియోల్ నటిస్తున్నారట.

 

ఈ చిత్రానికి అనీశ్ శర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో గ‘దర్ ఏక్ ప్రేమ కథ’ చిత్రం వచ్చి సూపర్ హిట్టైంది. అప్పట్లో ఈ చిత్రం పెను వివాదాలు రేపి సంచలన విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్ చిత్రం.. అది యాక్షన్ థ్రిల్లర్ కి స్కెచ్ వేశారట. దానికి హను రాఘవూడి దర్శకత్వం వహిస్తున్నారట. బాలీవుడ్ లో ఛాన్స్ అంటే చాలా గొప్ప విషయమే.. మరి ఈ యంగ్ డైరెక్టర్ అక్కడ మంచి హిట్ కొడితే మాత్రం మంచి లైన్లో పడ్డట్టే అంటున్నారు ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: