యాంకర్ గా సుమ సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. రెండు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెర మీద ఆమె యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగుతుంది. సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో సుమకు అవకాశాలు వచ్చాయంటే.. కేవలం రాజీవ్ కనకాల వల్లే ఆమెకు ఆఫర్లు రాలేదు.. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని ఆమె ఈ స్థాయికి వచ్చారు. తెలుగులో ఎంతోమంది యాంకర్లు ఉన్నా వారిలో సుమ మాత్రం చాలా స్పెషల్. 

 

ఆమె చేసే షో ఏదైనా సూపర్ హిట్ అవ్వాల్సిందే. స్టార్ హీరో అయినా సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ ఇస్తాడేమో కాని సుమ మాత్రం 365 రోజులు షూటింగ్స్ చేస్తూనే ఉంటుంది. బుల్లితెర మహారాణిగా సుమ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించారు. రియాలిటీ షో హోస్ట్ గానే కాదు సినిమా ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు సుమ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. 

 

ఇక లేటెస్ట్ గా సుమ హౌస్ ఆఫ్ హుంగామాలో ప్రత్యక్షం అయ్యింది. సుమతో పాటుగా సీరియల్ ఆర్టిస్టులు ప్రోమోలోనే వాళ్ల హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తుంది. యాంకర్ గా ఫుల్ జోష్ లో ఉన్న సుమ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ కామెడీ సీరియల్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చేలా ఉంది.

 

సుమ మాత్రమే కాదు సీరియల్ లో ప్రేక్షకులను అలరించే ఎంతో మంది స్మాల్ స్క్రీన్ స్టార్స్ కూడా హౌస్ ఆఫ్ హుంగామా లో ఉన్నారు. ప్రోమో ఈ రేంజ్ లో ఉంటే ఇక సీరియల్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సీరియల్ సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ రాత్రి 9:30 గంటలకు స్టార్ మా లో రానుంది. మరి స్టార్ మా కొత్తగా చేస్తున్న ఈ క్రేజీ షో ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: