జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొరటాల శివ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆ లుక్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాలో ఒక పాటను కూడా విడుదల చేసారు. 

 

ఉమెన్స్ డే సందర్భంగా విడుదల అయిన ఈ పాటకు సోషల్ మీడియా లో మంచి స్పందన వచ్చింది అనే చెప్పాలి. మగువా మగువా అంటూ మొదలైన ఈ పాటకు ఫిదా అయిపోయారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ సినిమాకు సంబంధించిన పనులను కూడా చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్... 

 

ఎవరితో సినిమా చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. ఇప్పుడు కొరటాల శివ తో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయనతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చర్చలు కూడా జరిపారట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాను సామాజిక కోణంలో ఉండే విధంగా చూడాలని పవన్ కళ్యాణ్ కొరటాల శివ ను కోరినట్టు సమాచారం. ప్రస్తుతం కొరటాల చిరంజీవి తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఆ సినిమా చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: