సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య విభేదాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలని మహేష్ బాబు దాదాపుగా రెండేళ్ళ నుంచి ప్రయత్నం చేస్తా వస్తున్నాడు. అయినా సరే మహేష్ బాబుకి మాత్రం త్రివిక్రమ్ నుంచి స్పష్టమైన హామీ మాత్రం లభించడం లేదని అంటున్నారు. ఎప్పటి నుంచో మహేష్ తో సినిమా అడుగుతున్నా సరే త్రివిక్రమ్ మాట దాటేస్తూ వస్తున్నారని దీనితో మహేష్ బాబు ఆగ్రహంగా ఉన్నారు అనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. 

 

మహేష్ బాబు వాస్తవానికి భరత్ అను నేను సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చెయ్యాలని ప్లాన్ చేసాడు. కాని అప్పుడు త్రివిక్రమ్ బిజీ గా ఉన్నారు. ఆ తర్వాత చెయ్యాలని చూస్తే అల్లు అర్జున్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో మళ్ళీ సినిమా చెయ్యాలని రెడీ అయ్యాడు. ఇప్పుడు ఆ కథలో బిజీ గా ఉన్నాడు త్రివిక్రమ్. దీనితో మహేష్ బాబు త్రివిక్రమ్ మీద ఫైర్ అయినట్టు సమాచారం. చేస్తా అంటే చేస్తా అని లేకపోతే లేదు అని చెప్పాలి గాని ఈ డ్రామా లు అవసరమా అని నిలదీసినట్టు సమాచారం. 

 

దీనితో ఇప్పుడు టాలీవుడ్ లో ఈ వార్త హిట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు నిర్మాతగా కూడా వ్యవహరిస్తా అని చెప్పినా త్రివిక్రమ్ ముందుకి రాలేదు అనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో వస్తున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అయినా సరే త్రివిక్రమ్ తో సినిమా చేసే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో.

మరింత సమాచారం తెలుసుకోండి: