ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లో సమంతా అక్కినేని ఒకరు. ఆమెతో సినిమా అనగానే చాలా మంది హీరోలు దర్శకులు పోటీ పడే వాళ్ళు. ఆ విధంగా ఆమె తెలుగులో తన ముద్ర వేసుకుంది. అటు తమిళ సినిమాల్లో కూడా ఆమె పర్వాలేదనిపించింది కూడా. అయితే కొన్ని రోజులుగా ఆమెతో సినిమా చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. వాస్తవానికి ఆమె పెళ్లి తర్వాత గుడ్ బై చెప్తుంది అనుకున్నారు. కాని వరుసగా సినిమాలు చేస్తుంది. పెళ్లి తర్వాత మంచి సినిమాలు చేసింది ఆమె. 

 

ఆ సినిమాల్లో చాలా వరకు విజయం సాధించాయి కూడా. ప్రస్తుతం ఆమె తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది. ఈ సినిమాల తర్వాత తెలుగులో రెండు సినిమాలకు ముందు ఆమె ఓకే చెప్పింది. అయితే ఆమె పారితోషికం ఎక్కువ చెప్పడం ఆమె గ్లామర్ కూడా తగ్గడం తో దర్శక నిర్మాతలు ఇప్పుడు వెనక్కు తగ్గుతున్నారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతూ వస్తుంది. ఆమెతో ఒకప్పుడు సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆమెతో సినిమా చేయడానికి ముందుకి రావడం లేదని టాక్. 

 

ఆమె రేటు తగ్గించినా సరే ఆమెతో సినిమా చేయడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించడం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనిపై వార్తలు ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల ఆమె నటించిన జానూ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీనితో ఆమె క్రేజ్ తగ్గింది అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. ఆమె నటనకు మంచి మార్కులే పడినా సమంతా అంతగా అందం పరంగా ఆకట్టుకోలేదు అని అంటున్నారు. దీనితో ఆమెతో సినిమా చెయ్యాలని భావించిన అగ్ర దర్శకులు కూడా వద్దని డ్రాప్ అయిపోయినట్టు సమాచారం. దీనితో సమంతా కూడా సినిమాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: