టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన తేనె మనసులు సినిమాతో హీరోగా పరిచయమైన నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ, ఆ తరువాత నుండి తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ముందుగా నటశేఖర బిరుదు అందుకున్న కృష్ణ, ఆపై ఎన్నో గొప్ప గొప్ప విజయాలతో, ఎందరో అభిమానులను సంపాదించుకుని సూపర్ స్టార్ గా తిరుగులేని ఖ్యాతిని గడించారు. మొదటి నుండి ఏ విషయాన్నైనా ఏ మాత్రం దాపరికంగా లేకుండా డేరింగ్ గా డాషింగ్ గా చేసే అలవాటున్న కృష్ణ, అప్పటికే టాలీవుడ్ లో సూపర్ స్టార్లు వెలుగొడుతున్న ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఒకానొక సమయంలో గట్టి పోటీని ఇచ్చారు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా అప్పట్లో కృష్ణ సినిమాలు విడుదలై పెద్ద విజయాలుగా నిలిచేవి. 

 

మొదటి నుండి తాను ఏఎన్నార్ కు పెద్ద అభిమానిని అని చెప్పే కృష్ణ, ఎన్టీఆర్ గారు అంటే ఎంతో ప్రత్యేకమైన ఇష్టం అని చెప్పేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సినిమాలతో పోటాపోటీగా కృష్ణ సినిమాలు రిలీజ్ అయి థియేటర్స్ లోకి వచ్చి సందడి చేసి విజయాలు అందుకున్న సమయంలో ఆయన మాట్లాడుతూ, తనకు రామారావుగారితో కెరీర్ పరంగా పోటీనే తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎటువంటి సమస్య లేదని అనే వారు. ముఖ్యంగా తనతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చే దర్శక, నిర్మాతలకు కొందరికి ఆర్థికంగా సాయమందించిన కృష్ణ, తనతో సినిమాలు తీసిన నిర్మాతలు నష్టపోతే, వారికి మరొక సినిమా ఫ్రీగా చేసిపెట్టడం వంటి గొప్ప పనులు ఎన్నో చేసారు. 

 

ఇక మొదటి నుండి తన అభిమానులను తన కుటుంబసభ్యులుగా భావించి వారికి ఎంతో విలువనిచ్చి కాపాడుకునే కృష్ణ, ఆ అభిమాన సంపదను తనయుడు సూపర్ స్టార్ మహేష్ కు అందించారు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, అప్పట్లో ఒకానొక సమయంలో కృష్ణ తిరుగులేని పెద్ద సూపర్ స్టార్ గా ఎంతో గొప్ప మాస్ ఇమేజ్ తో దూసుకెళ్లారు. కెరీర్ పరంగా 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణకు అవార్డులు మాత్రం రాకపోవడం, ఇప్పటికీ ఆయన అభిమానులను కలవరపరిచే సమస్యే అని చెప్పాలి. అవార్డులు రానప్పటికీ ప్రజల ఆదరణే తనకు ఎంతో గొప్ప రివార్డు అని వ్యాఖ్యానించే కృష్ణ, టాలీవుడ్ కి సినిమా స్కోప్, మొదటి 70ఎమ్ఎమ్, మొదటి కౌబాయ్, మొదటి జేమ్స్ బాండ్ సినిమా, మొదటి స్టీరియో ఫోనిక్ సౌండ్, వంటి నూతన పోకడలను అందించారు. 

 

ఇక ఆ సమయంలో కృష్ణ తన సినిమాలతో గొప్ప రికార్డులను నెలకొల్పడంతో పాటు, తన సినిమాలతో తానే వాటిని తిరగరాసి గొప్ప పేరున్న నటుడిగా నిలిచారు. చూడడానికి ఎంతో అందంగా ఉండే కృష్ణ, మనసు కూడా అంతే అందంగా ఉంటుందని, తన చుట్టూ ఉన్న వారు కష్టాల్లో ఉంటే వెంటనే చలించిపోయి కృష్ణ, వారికి తనవంతుగా సాయమందించేవారని, అలానే అప్పట్లో ఒక రోజులో 18 గంటల పాటు పని చేసి సినిమాల్లో నటించిన కృష్ణకు మరొక నటుడు ఎవరూ కూడా సాటి రాలేరని దాసరి నారాయణరావు వంటి ఎందరో సినిమా ప్రముఖులు చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: