ప్రపంచ వ్యాప్తంగా కరోనా పై భయాలు కొనసాగుతున్న పరిస్థితులలో  ఈ ఉపద్రవం నుండి మానవాళి ఎప్పుడు బయట పడుతుంది అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా మారింది. తనకు కరోనా వైరస్ సోకినట్లు హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ స్వయంగా ప్రకటన ఇవ్వడంతో ఈ వైరస్ ఎవరిని వదలడం లేదు అన్న విషయం స్పష్టం అవుతోంది.  ప్రస్తుతం మనదేశంలో కరోనా బాధితుల సంఖ్యా  62కు చేరింది. 


దీనితో దేశంలోని ప్రజలు అంత బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జనంలో కరోనా పై ఉన్న భయాలను క్యాష్ చేసుకునే పనిలో కొందరు దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నారు.  తెలుస్తున్న సమాచరం మేరకు  కన్నడ దర్శకుడు ఉమేశ్ భనకర్‌ కరోనా పై ఒక సినిమా తీస్తాను అని ప్రకటించడమే కాకుండా ‘డెడ్లీ కరోనా’ అన్న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.


ఈ మూవీని పాన్‌ ఇండియా మూవీగా తీస్తూ అన్ని భాషలలో డబ్ చేసి విడుదల చేస్తానని చెపుతున్నాడు. అసలు కరోనా వైరస్‌ ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? దాని ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉంది? లాంటి అనేక ఆసక్తికర విషయాలు ఈ సినిమాలో ఉంటాయని ఈ మూవీ అతిత్వరగా పూర్తి చేసి నెల రోజుల లోపే విడుదల చేస్తామని ఈ దర్శకుడు చెపుతున్నాడు. 


ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ ప్రభావం గురించి వార్తలు వచ్చిన దగ్గర నుండి గతంలో సూర్య నటించిన హిస్టారికల్‌ మెడికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ  ‘సెవెన్త్ సెన్స్‌’ గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఆ సినిమాలో కూడ కరోనా వైరస్ లానే ఒక వైరస్ తో ప్రపంచాన్ని అంతం చేయడానికి కొందరు చేసిన ప్రయత్నాలకు యోగి రూపంలో ఉన్న సూర్య అడ్డుకుంటాడు. అప్పట్లో ఈ సినిమా చాల హిట్. దీనితో అలాంటి హిట్ ను ఆశిస్తూ ఈ కన్నడ దర్శకుడు ఈ వింధ్ ప్రయోగం చేస్తున్నాడు అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: