టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో ఇలియానా కూడా ఒకరు. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె ఒకప్పుడు సినిమాలు చేసింది. పారితోషికం కూడా ఆమె ఎక్కువగానే తీసుకునేది అప్పట్లో. అయితే ఆ తర్వాత ఆమె ప్రభ కాస్త తగ్గడంతో హీరోలు కూడా ఆమెను వద్దని అన్నారు. చేసిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవ్వడంతో ఆమె కెరీర్ ఇబ్బంది పడింది. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్న సమయంలో ఆమె ప్రేమ వ్యవహారం మరింతగా ఇబ్బంది పెట్టింది అనే చెప్పవచ్చు. ఆ ప్రేమ వ్యవహారం తర్వాత దర్శకులు ఆమెను లైట్ తీసుకున్నారు. 

 

పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉందని కొందరు, పెళ్లి చేసుకుని సెటిల్ అయింది అని మరికొందరు ప్రచారం చేసారు. ఇప్పుడు ఆమె మళ్ళీ టాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. ఒకప్పుడు అవకాశాలు వస్తే వద్దని చెప్పిన ఇలియానా ఇప్పుడు అవకాశాలు కావాలని దర్శకులు చుట్టూ తిరుగుతుంది. తనకు ఇంకా వయసు ఉందని తనకు ఫాలోయింగ్ కూడా ఉందని అనవసరం తాను కెరీర్ ని స్పాయిల్ చేసుకున్నాను అనే భావన ఆమెలో ఉందని అందుకే ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాలు చెయ్యాలని చూస్తుంది అంటున్నారు టాలీవుడ్ జనాలు. 

 

ఇప్పుడు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి పెద్దగా దర్శక నిర్మాతలు ఆసక్తి కూడా చూపించడం లేదట. అయినా సరే ఆమె తనకు గతంలో ఉన్న పరిచయాలను ఎక్కువగా వాడి, టాలీవుడ్ లో అవకాశాల కోస౦ ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆమెకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ తో కూడా ఆమెకు సినిమా ఆఫర్ వచ్చిందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె మాత్రం సంప్రదింపులు జరపగా ఓకే చేసారట క్రిష్. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: