ప్రపంచాన్ని గజగజ లాడిస్తున్న కరోనా వైరస్ 70 దేశాలకు పైగానే విస్తరించింది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ అన్ని ఖండాలలో వ్యాపించింది. భారతదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ మరియు కేరళ అదేవిధంగా తెలంగాణ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ కరోనా వైరస్ బారిన పడిన రోగులు బయటపడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 52 వైద్య పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వైరస్ దెబ్బకి హాలీవుడ్ సినిమా రంగానికి చెందిన వాళ్లు తమ సినిమాలను ఆపేశారు. బహిరంగ ప్రదేశాలలో జనం ఎక్కువగా ఉండే చోట ఈ వ్యాధి అది ఫాస్ట్ గా విస్తరించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా హాల్ అన్నీ బంద్ అవుతున్నాయి.

 

తాజాగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ వ్యాధి మూలాలు బయటపడటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినిమా హాల్ వీకెండ్ కావడంతో శుక్రవారం థియేటర్లు అన్ని ఖాళీ అయిపోయాయి. మేటర్ లోకి వెళ్తే తెలుగు సినిమా రంగానికి చెందిన వాళ్లు కూడా ఈ శుక్రవారం సినిమాలు రిలీజ్ అవాల్సినవి పోస్ట్ పోన్ చేశారు. ఇదే టైమ్ లో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పరీక్షలు కూడా జరుగుతున్న తరుణంలో చాలా వరకు ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సినిమాలు రిలీజ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం భీష్మా మరియు ఇంకొన్ని చిన్న సినిమాలు థియేటర్లో ఆడుతున్నాయి.

 

ఇటువంటి తరుణంలో నెక్స్ట్ 11 సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. దీంతో ఒకవేళ అంతా ఓకే అయితే ఆ సినిమాలు రిలీజ్ అవ్వడానికి థియేటర్ల కష్టం మొదలవుతుంది అన్న టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినబడుతుంది. ఒకవైపు కరోనా వైరస్ మరోవైపు పరీక్షలు టెన్షన్ తో తెలుగు సినిమా రంగానికి చెందిన వాళ్లు సతమతమవుతున్నారు. ఏది ఏమైనా ఉన్న కొద్ది పోస్ట్ పోన్ అయితే సదరు సినిమా నిర్మాత కూడా...చాలా నష్టపోవడం గ్యారెంటీ. ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలు ఈ శుక్రవారం మాత్రం కరోనా వైరస్ మరియు ఎగ్జామ్స్ వల్ల వాయిదా పడ్డాయి. దీంతో ఈ శుక్రవారం థియేటర్లు ఖాళీ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: