త్రివిక్ర‌మ్ సినిమాల్లో వేసే పంచ్‌ల‌కి ప్రేక్ష‌కులంద‌రూ కూడా ఫిదా అయిపోయారు అందుకే ఆయ‌న‌కి మాట‌ల మాంత్రికుడు అనే పేరు ఉంది. ఇక టాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ర‌చ‌యిత‌లుగా మంచి పేరు గాంచిన ద‌ర్శ‌కులు కొంత మంది ఉన్నారు. వారు పోసాని, త్రివిక్ర‌మ్‌, కొర‌టాల వంటి వారి సినిమాల‌కి కేవ‌లం డైలాగుల కోస‌మే వెళ‌తాము. ఇక త్రివిక్ర‌మ్ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు ఆయ‌న మాట‌ల‌తోనే మాయ చేసేస్తాడు. రచయితగా సక్సెస్ అయిన త్రివిక్రమ్.. తర్వాత `నువ్వే నువ్వే` చిత్రంతో దర్శకుడిగా మారాడు.  అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అ ఆ, అరవింద సమేత వంటి సక్సెస్ సినిమాలను దూసుకుపోతున్నాడు.

 

ఇటీవలే విడుద‌లైన  అల వైకుంఠపురంలో చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా  నిలిచింది. అయితే ఈ సినిమాని కూడా  విమర్శించే వాళ్ళూ లేకపోలేదు. ఇక ఇది కొంత మందికి న‌చ్చింది. మ‌రికొంత మంది కొన్నివిమ‌ర్శ‌లు కూడా చేశారు. అవేమిటంటే...1956లో రిలీజైన రామారావు నటించిన ‘ఇంటిగుట్టు’ చిత్రాన్ని కాపీ కొట్టాడని... మ‌రేదో కొరియ‌న్ మూవీ కాపీ అని ఇలా ర‌క ర‌కాల విమ‌ర్శ‌లుకూడా వ‌చ్చాయి. అయితే  ఈ మూవీలో పూజాహెగ్డే పాత్రను త్రివిక్రమ్ చూపించిన విధానం మాత్రం చాలా మందికి న‌చ్చ‌లేదు. అందులోనూ లేడీస్‌కి అస్స‌లు న‌చ్చ‌లేద‌నే చెప్పాలి. పూజాహెగ్డే పాత్ర సినిమాలో కనిపించడంతోనే ఆమె తొడల మీద ఫోకస్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆమె ఎంట్రీనే తొడ‌ల‌తో స్టార్ట్ చేశాడు త్రివిక్ర‌మ్‌.

 


అంతేకాక ఏకంగా ఆమె తొడల పైనే ఒక పాట‌. ఇక ఆ పాట హిట్టా ఫ‌ట్టా అన్న విష‌యం ప‌క్క‌న పెడితే అలా అవి చూపిస్తూ పాట‌పాడ‌టం అనేది చాలా అస‌హ్యంగా అనిపించింద‌ట చాలా మందికి. ఇక‌ దీనిపై సోషల్ మీడియాలో చ‌ర్చ‌లు మొద‌లెట్టారు. రకరకలుగా విమర్శలు చేస్తున్నారు. “నీ కాళ్ళను పట్టుకు వదలనంది చూడే నా కళ్ళు..” అని కాకుండా “నీ తొడలు పట్టుకు వదలనంది చూడే నా కళ్ళు…” అని రాస్తే బాగుండేది అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరైతే గురూజీ గా పిలవబడే త్రివిక్రమ్ రాను రాను “లీకేజీ”గా మారిపోతున్నారని విమర్శిస్తున్నారు. రాబోయే సినిమాల్లో అయినా  క‌నీసం ఇలాంటివి ఫోకస్ చేయకుండా ఉంటే బేటర్ అని త్రివిక్రమ్ కు కొంత మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకంగా స‌ల‌హాలు కూడా ఇచ్చేస్తున్నాడు. చూద్దాంమ‌రి త్రివిక్ర‌మ్ ఇవి ఎంత వ‌ర‌కు తీసుకుంటాడో. 

మరింత సమాచారం తెలుసుకోండి: