కొంత మంది హీరోయిన్లు ఇంకా పెళ్ళి ఊసే లేకుండా అలా జీవితాల్ని గ‌డిపేస్తున్నారు. ఇక వీళ్ళ‌కంటే వ‌య‌సులో చిన్న‌వాళ్ళు పెళ్ళి చేసుకుని కుటుంబంతో ఆనందంగా జీవిస్తుంటే వీళ్ళు మాత్రం ఐదు ప‌దులు వ‌చ్చినా కూడా ఇంకా సినిమాలు రాజ‌కియాలు అంటూ తిరుగుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు పెళ్ళి చేసుకోకుండా ఉండేఉంట‌ది అనుకుంటే ఏదైనా బ‌ల‌మైన కార‌ణం ఉండే ఉంట‌ది అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఆ బ‌ల‌మైన కార‌ణం ప్రేమ విఫ‌లం అయితే అంత‌క‌న్నా దార‌ణం ఇంకేముంట‌ది. క‌థానాయిక‌గా ట‌బు తెలుగు తెర పై చెర‌గ‌ని ముద్ర‌వేసింది. ఆమె చేసింది త‌క్కువ చిత్రాలే అయినా కూడా ట‌బు అనగానే ట‌బు అంటే చాలు తెలుగు ప్రేక్ష‌కులు మా క‌థానాయికే అంటారు. వెంక‌టేష్‌తో కూలినెం.1 త‌ర్వాత అక్కినేని నాగార్జునతో క‌లిసి నిన్నేపెళ్ళాడ‌తా చిత్రంలో న‌టించింది. ఇక ఈ సినిమాలో ట‌బు, నాగార్జున‌ల కెమిస్ట్రీ గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత చెన్న‌కేశ‌వ‌రెడ్డి, ఆవిడామాఆవిడే, పాండురంగ‌డు, ఇదీ సంగ‌తి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి అల‌రించారు. ఇక ఆమె త‌మిళంలో న‌టంచిన కాద‌ల్ దేశం తెలుగులో ప్రేమ‌దేశంగా విడుద‌లై ఘ‌న విజయం సాధించింది. బెంగా,లి మ‌రాఠీ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్ప‌ట్లో ఆమె ప్రేమ‌లో ప‌డింద‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అక్కినేని నాగార్జున‌తో స‌న్నిహితంగా మెలుగుతుంద‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. వీరిద్ద‌రూ ఏకంగా మ‌ళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నార‌న్నంత‌లా చెప్పుకున్నారు అంద‌రూ. బాలీవుడ్ నిర్మాత స‌జిత్‌న‌డియాడాతో బంధం ఉంద‌ని అందుకే ఆమె వివాహం చేసుకోలేద‌ని అంద‌రూ అంటుంటారు.

 

ఇక హీరోయిన్ న‌గ్మా కూడా ఇదే లిస్ట్‌లోకి వ‌స్తుంది. న‌గ్మా ఒక‌ప్పుడు ద‌క్షిణాదిలో స్టార్‌డ‌మ్‌ని ఎంజాయ్ చేసింది. త‌మిళ, మ‌ల‌యాళ తెలుగు హిందీ భాష‌ల్లో చాలా సినిమాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం 40ఏళ్ళు పై బ‌డిన న‌గ్మా ఇంకా వివాహం చేసుకోలేదు. అస‌లు ఇప్ప‌టివ‌ర‌కు ఎందుకు వివాహం చేసుకోలేదు అన్న విష‌యంలో ప‌రిశ్ర‌మ‌లో ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఒక‌ప్పుడు కోలీవుడ్ స్టార్‌తో న‌గ్మా న‌డిపిన ప్రేమాయ‌ణం ఫేల్ కావ‌డంతో న‌గ్మాపెళ్ళికి దూరంగా ఉంద‌ని కొంత‌మంది అంటుంటారు. ఆ త‌ర్వాత న‌గ్మా కొంత కాలం బివిఎస్ ల‌క్ష్మ‌ణ్‌తో ఇక న‌గ్మాని పెళ్ళి చేసుకుంటాడ‌నుకున్న శ‌ర‌త్‌కుమార్ చివ‌రి నిమిషంలో రాధిక‌ను వివాహం చేసుకున్నారు. అప్ప‌టి నుంచి పెళ్ళి ప్ర‌స్థావ‌న అనేది లేకుండా ఆమ‌డ దూరంలో ఉంటుంది. ఆ త‌ర్వాత మాజీ క్రికెట‌ర్ గంగూలితోనూ ల‌వ్ ఎఫైర్ న‌డిచింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు రావ‌డ‌మే కాకుండా వీరిద్ద‌రూ క‌లిసి ఒక ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించ‌డంతో ఈ వార్త‌లు పుట్టుకొచ్చాయి. ఇక ఎఫైర్స్‌కి స్వ‌స్తి చెప్పి పెళ్ళి గురించి ప‌క్క‌న పెట్టి రాజ‌కియాల్లోకి ఎంట‌ర్ అయింది. ప్ర‌స్తుతం న‌గ్మా రాజ‌కియాల్లో సీటు కోసం ఎదురు చూస్తుంది.

 

ఒక‌ప్ప‌టి అందాత తార సీనియ‌ర్‌న‌టి క్లాసిక‌ల్ డాన్స‌ర్ శోభ‌న‌. ఈమె పెళ్ళికి దూర‌మైంద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఆమె పూర్తిపేరు శోభ‌న చంద్ర‌కుమారి పిల్లై. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై అన్ని భాష‌ల్లోనూ న‌టించింది. ఈమె కేవ‌లం మంచి సినిమాలు మాత్ర‌మే న‌టించి ప్రేక్ష‌కుల గుండెల్లో ఎక్కువ‌గా నిలిచిపోయింది. అలా శోభ‌న ఓ ప్ర‌ముఖ మ‌ల‌యాళ హీరోతో కొన్నేళ్ళుపాటు ప్రేమాయ‌ణం సాగించిన ఆయ‌న‌ను వివాహం చేసుకోవాల‌నుకుంది. అయితే ఆయన చూస్తూ ఉండ‌గానే శోభ‌న‌కు హ్యాండ్ ఇవ్వ‌డంతో మ‌గాళ్ళ పై శోభ‌న‌కు మ‌న‌సు విరిగిపోయింద‌ట‌. అప్ప‌టి నుంచి త‌న జీవితంలో ప్రేమ పెళ్ళి వాటికి చోటివ్వ‌న‌ని అనుకుంది. ఇంక త‌ను ఎక్కువ‌గా డాన్స్‌కి జీవితాన్ని అంకితం చేసింద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: