పాత నీరు పోయి కొత్త నీరు వస్తుందనేది సామెత. ఇది సినిమా ఇండస్ట్రీకి బాగా వర్తిస్తుంది. సినిమాలు వస్తూంటాయి.. కొన్ని సినిమాలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ పాత రికార్డులను చెరిపేస్తూంటాయి. ప్రస్తుతం బన్నీత్రివిక్రమ్ తమ అల.. వైకుంఠపురములో సినిమాతో ఇదే చేశారు. గత నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డుల దుమ్ము దులిపి కొత్త ఇండస్ట్రీ రికార్డును సెట్ చేశారు. సంక్రాంతికి విడుదలైన అల.. సినిమా క్లోజింగ్ బిజినెస్ చూస్తే ఇదే అవగతమవుతోంది.

 

 

అల.. వైకుంఠపురములో వరల్డ్ వైడ్ క్లోజింగ్ బిజినెస్ దాదాపు 163 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 132 కోట్ల షేర్ ను రాబట్టిందని తెలుస్తోంది. నైజాంలో 44కోట్లు వరకూ వసూలు చేసిందంటున్నారు. యూఎస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. రంగస్థలం, సైరా పేరిట ఉన్న నాన్ బాహుబలి లెక్కలను అల.. అలవోకగా దాటేసిందని అంటున్నారు. సినిమాకు వచ్చిన టాక్, సినిమా రన్ అయిన విధానం కలెక్షన్లను ధృవీకరిస్తున్నాయి. సినిమా విజయంలో కీలక పాత్ర పాటలదే. తమన్ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. మూడు నెలల ముందు నుంచే పాటలను ప్రేక్షకులకు ఎక్కించేసి సినిమాలో కూడా అదే టెంపో మెయింటైన్ చేయడంతో సినిమా ఎక్కడా ఆగలేదు.

 

 

తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని దుమ్ము దులిపేసింది. బుట్ట బొమ్మ పాట అయితే ఇండియన్ సెన్షేషన్ అయిందనడంలో సందేహం లేదు. బన్నీత్రివిక్రమ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి కంటే ఎంతో ఎత్తులో ఈ సినిమాను నిలబెట్టారు. పక్కా త్రివిక్రమ్ మార్క్ సినిమాగా అల.. వైకుంఠపురములో నిలిచింది. బన్నీ స్టైల్ అండ్ యాక్షన్ మెస్మరైజ్ చేసింది. కీలకపాత్రలో మురళి శర్మ మెప్పించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: