నందమూరి బాలక్రిష్ణ సీనియర్లలో టాప్ హీరో. అలాగే  నట‌వారసుల్లో తొలి హీరో. ఇక బాలనటుడిగా 1974లో తెరంగ్రేట్రం చేసి ఇప్పటిదాకా అవిశ్రాంతంగా 46 ఏళ్ళుగా  నటిస్తున్న  నటుడు కూడా బాలయ్యే. ఇక టాలీవుడ్లో జానపద, పౌరాణిక, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లో నటించిన ఏకైక నటుడు కూడా బాలయ్యే. ఇక రికార్డులు బాలయ్యకు ఎన్నో ఉన్నాయి. ఫ్రాక్షన్ కధాంశంతో ఎక్కువ‌ సినిమాల్లో నటించి బాక్సాఫీస్ ని షేక్ చేసిన తొలి హీరో  కూడా బాలయ్యే.

 

నాటి తరం నటులు, దర్శకులు, హీరోలు, సంగీత దర్శకులతో పాటు నేటి తరం వారందరితో కూడా బాలయ్య నటించిన రికార్డు ఉంది.  ఇవన్నీ  ఇలా ఉంటే బాలయ్య తనకు తెలియకుండానే మరో రికార్డు క్రియేట్ చేశారు. అదేంటి అంటే ఆయన డబుల్ రోల్స్ ఎక్కువగా వేయడం. ఇది ఇండియన్ స్క్రీన్ మీదనే రికార్డు అని కూడా అంటున్నారు.

 

బాలయ్య ఇప్పటివరకూ 15 సినిమాల్లో డబుల్ రోల్స్, త్రిబుల్ రోల్స్ కూడా వేశారు. ఆయన తొలిసారిగా 1986లో అపూర్వ సహోదరులు మూవీలో ద్విపాత్రాభినయం చేశారు. ఆ తరువాత నుంచి ఇప్పటిదాకా  డ్యుయల్ రోల్ లో నటించిన సినిమాలు 15 ఉంటే తాజాగా బోయపాటితో హ్యాట్రిక్ మూవీలో కూడా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. అది పదహారవ మూవీ అవుతుంది. 

 

తెలుగులో ఇప్పటికి మహేష్, అల్లు అర్జున్, రాం చరణ్, పవన్ వంటి స్టార్లు డ్యూయల్ రోల్ చేయలేదు. ఇక చిరంజీవి వంటి వారు కొన్ని సినిమాలు చేస్తే నాగ్, వెంకీ ఒకటో రెండో చేశారు. ఇలా ఇన్నేసి చిత్రాలో డ్యూయల్ రోల్ వేయడం అంటే అది బాలయ్యకే సాధ్యమని అంటున్నారు. ఇది ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు అంటున్నారు. 

 

బాలయ్య ఇంకా నటిస్తూనే ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో ఆయన మరో నాలుగు సినిమాలు చేస్తే 20 సినిమాలు డ్యూయల్ రోల్ చేసినవి అవుతాయి. అంటే  ఆ రికార్డ్ శాశ్వతం అన్నమాట. ఎవరూ టచ్ చేయలేనిది అన్నమాట. దటీజ్ బాలయ్య.

 

మరింత సమాచారం తెలుసుకోండి: