మెగా హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వరుణ్ తేజ్  టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మెగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్రస్తుతం వరుణ్ తేజ్ కి ప్రత్యేక ఇమేజ్ ఉంటుంది. అయితే వరుణ్ తేజ్ కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి... హడావిడిగా ఏది పడితే అది చేయకుండా ... కేవలం వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. కంటెంట్ బలంగా ఉండి... కథ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందుకే ఇప్పటి వరకూ వరున్ తేజ్ చేసిన సినిమాలన్నీ కాస్త రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. అందుకే వరుణ్ తేజ్  ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా లో ఏదో ప్రత్యేకత ఉంటుంది అని అటు తెలుగు ప్రేక్షకులకు కూడా నమ్మకం ఉంటుంది. 

 


 ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. గతేడాది ఎఫ్2 సినిమా లో వెంకటేష్ తో కలిసి నటించే మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ మెగా హీరో... తర్వాత గద్దల కొండ గణేష్ తో మరో భారీ విజయం సాధించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దల కొండ గణేష్ లో  పూర్తిగా భిన్నమైన గెటప్ తో ... నట విశ్వరూపం చూపించాడు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్  హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్  ఫిలిమ్స్... బ్లూ వాటర్ క్రియేటివ్ పథకాలపై సిద్దు ముద్ద, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

 ఇక ఈ సినిమాలో  వరుణ్ తేజ్ కి జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సయి మంజ్రేకర్  నటిస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అయితే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుందన్న  విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని జూలై 30న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర బంధం. తాజాగా మీడియాతో మాట్లాడిన దర్శకుడు కిరణ్ కొర్రపాటి... ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ... ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించడానికి వరుణ్ తేజ్ ఏకంగా  అమెరికా వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశామని .. ఈ సినిమాలో నవీన్ చంద్ర, నదియా లపై కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించామని  చెప్పారు. ఈ సినిమాను జులై 30న విడుదల చేయాలనుకుంటున్నాం అంటూ దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: