యాక్టింగ్ లో ఎంత పెద్ద జీనియస్ అయినా హిట్స్ ఉంటేనే కెరీర్ బాగుంటుంది. పొరపాటున ఫ్లాపులు పడితే మార్కెట్ లైట్ తీసుకుంటుంది. కెరీర్ కష్టాల్లో పడుతుంది. ఇప్పుడు శర్వానంద్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వరుస ఫ్లాపులతో ఈ హీరోకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. 

 

యంగ్ స్టర్స్ లో బెస్ట్ పెర్ఫామర్ ఎవరు అని ఓ సంస్థ ఆన్ లైన్ సర్వే చేస్తే శర్వానంద్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ హీరో ఎలాంటి పాత్రైనా చేయగలడని ఓట్లేశారు నెటిజన్లు. అయితే యాక్టర్ గా మంచి మార్కులు తెచ్చుకున్నా, మార్కెట్ మాత్రం పెంచుకోలేకపోతున్నాడు. వరుసగా తగులుతోన్న ఫ్లాపులు షాకులకు శర్వా గ్రాఫ్ నేలని చూస్తోంది. 

 

శర్వానంద్ రీసెంట్ మూవీ జాను. ఈ సినిమాలో శర్వా, సమంతని డామినేట్ చేశాడనే రెస్పాన్స్ వచ్చినా.. పెద్దగా వసూల్ చేయలేకపోయాడు. ఇక ఈ మూవీకి ముందు వచ్చిన పడిపడి లేచె మనసు, రణరంగం సినిమాలు ఫఅలాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ వరుస ఫ్లాపులతో శర్వానంద్ మార్కెట్ ఢల్ అయింది. 

 

శర్వానంద్ మళ్లీ ఓ సూపర్ హిట్ కొడితేనే మార్కెట్ నిలబడుతుంది.  ఏ మాత్రం తడబడినా కెరీర్ డేంజర్ జోన్ లోకి వెళ్తుంది. ఇలాంటి సిట్యువేషన్ లో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు. యువరైతుగా బాక్సాఫీస్ క్షేత్రంలో పంట పండించడానికి సిద్ధమవుతున్నాడు. మరి శ్రీకారంతో నాగలిపట్టిన శర్వాకు బాక్సాఫీస్ సిరుల పంట పండిస్తుందా.. శ్రమ దోపిడీ చేస్తుందా అనేది తెలియాలంటే వచ్చే నెల 24వరకు వెయిట్ చేయాల్సిందే. 

 

శర్వానంద్ కు పక్కింటి అబ్బాయిగా.. యంగ్ స్టర్స్ హీరోగా మంచి పేరుంది. ఆయన నటనంటే విపరీతంగా అభిమానంచే వారు ఎంతో మంది ఉన్నారు. ప్రస్థానం, గమ్యం లాంటి సినిమాలు ఆయన కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచాయి. ఇపుడు నాగలిపట్టిన శర్వా ఆ పాత్రకు న్యాయం చేస్తాడని సినీజనాలు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: