సాధారణంగా ఒక అబ్బాయి.. అమ్మాయిని చూస్తే.. మొదటి ప్రపోజ్‌ చేయడం.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించడం.. పెళ్లి చేసుకోవడం.. ఇదందా జరిగేందుకు చాలా సమయం పడుతుంది. కానీ ఓ హీరోయిన్, డైరెక్టర్ మాత్రం.. ఉదయం చూసుకుని, మధ్యాహ్నం ప్రేమించుకుని, సాయంత్రం పెళ్లి చేసుకున్నారట.. నమ్మడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.. అందులోనూ సినీరంగంలో ఇలా జరగడం నిజంగా విశేషమే.

 

 

మరి ఇంతకీ ఆ జంట ఎవరో తెలుసుకుందామా.. హీరోయిన్ ఒకప్పటి హీరోయిన్ తులసి.. డైరెక్టర్ శివమణి.. ఆయన కన్నడ, తమిళ సినిమాల దర్శకుడు.. తెలుగులో పెద్దగా లేవనుకోండి. ఆయన ఓ సినిమాలో హీరోయిన్ గా తులసిని తీసుకున్నారట. ఆ రోజే సినిమా షూటింగ్ ప్రారంభం.. అయితే విచిత్రంగా అదే రోజు ఆ హీరోయిన్ పుట్టిన రోజు కూడా. హీరోయిన్ తులసి కుటుంబం అంతా సాయిబాబు భక్తులు.

 

IHG

 

అందుకే ఆమె పుట్టినరోజున ఆమె తాతయ్య సాయిబాబా ఫొటో ముద్రించిన కార్డులను షూటింగ్ స్పాట్ లో ఉన్న అందరికీ బహుమానంగా ఇచ్చేవారట. వాటిని ప్రతి యూనిట్‌లోనూ తులసి పంచేదట. ఆ రోజు అలా పంచగా.. రెండో మూడో మిగిలితే ఆ సినిమా దర్శకుడు శివమణిగారికి ఇచ్చిందట. అయితే ఈ దర్శకుడు శివమణి... మధ్యాహ్నం భోజనానికని ఇంటికి వెళ్లి తులసి ఇచ్చిన ఫొటోను పూజ గదిలో పెట్టారట.

 

 

ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో.. ఆమెను తొలిచూపులోనే ప్రేమించారో ఏమో.. తర్వాత షూటింగ్‌కు వచ్చేటప్పుడు ఏకంగా తాళి చేతిలో పెట్టుకుని తీసుకొచ్చారట. ఆ సాయంత్రం పేకప్‌ చెప్పగానే తులసితో తన ప్రేమ విషయం చెప్పారట. అందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపడంతో వెంటనే పెళ్లి చేసుకున్నారట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తులసి భర్త ఇప్పటివరకూ దాదాపు 27 సినిమాలు డైరెక్ట్‌ చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ప్రేమ కథ భలే వింతగా ఉంది కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: