మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా తర్వాత కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం 'ఆచార్య' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ఈ సినిమాలో చిరు కి జోడీగా నటిస్తుండగా రీసెంట్ గా చిరు రెజీనా మీద ఒక స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. ఈ సాంగ్ లో చిరు డాన్స్ వావ్ అనిపించేలా ఉన్నాయట. ఇక రెజీనా కూడా ఈ సాంగ్ లాంటిది లైఫ్ లో మళ్ళీ చేయలేమో అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ముఖ్య పాత్రలో చిరంజీవ్తో కలిసి ఒకే ఫేం లో కలిసి కనిపించబోతున్నారు. ఈ మాట ఉంటేనే అటు మెగా ఫ్యాన్స్ కి ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలొస్తున్నాయి. 

 

అయితే ఈ సినిమాకోసం మహేష్ బాబు కి 40 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇది పెద్ద హాట్ టాపిక్ అయినప్పటికి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి సూపర్ స్టార్ కి ఆ రెమ్యూనరేషన్ అంత పెద్ద మొత్తం కాదన్న టాక్ కూడా నడుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ లో మహేష్ బాబు మే మూడవ వారం నుండి జాయిన్ కాబోతున్నారట. ఇక మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి మన మెగాస్టార్ కి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నోరు తెరిచి అడిగారో లేదో సైరా సినిమాలో నటించడానికి వెంటనే అంగీకరించారు. అంతేకాదు సైరాలో పోషించిన పాత్రకి అమితాబ్ బచ్చన్ రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదన్న టాక్ కూడా అప్పట్లో వచ్చింది. 

 

అది కూడా చిరంజీవి మీద అభిమానం తోనే అలా రెమ్యూనరేషన్ లేకుండా నటించారట అమితాబ్. అయితే ఇప్పుడు తాజాగా అమితాబ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు అమితాబ్ ఇలా స్పందిస్తారని ఎవరూ ఊహించను కూడా ఊహించలేదు. టాలీవుడ్ లో ఇన్నాళ్ళకి ఒక భారీ మల్టీ స్టార్ రాబోతుందని ఆ మల్టి స్టారర్ లో ఇద్దరు స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించడం చాలా ఆసక్తికరమైన విషయమని అన్నారట. అంతేకాదు వీళ్ళిద్దరిని ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూస్తానా అన్న అతృత నాలో బాగా పెరుగుతోందని అన్నారట. దాంతో పాటు ఈ భారీ మల్టి స్టారర్ తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయాలని ఆకాంక్షించారట. 

 

నిజంగా అంత పెద్ద బాలీవుడ్ స్టార్ అంతాబ్ బచ్చన్ చిరంజీవి, మహేష్ బాబు కలిసి నటిస్తున్న సినిమా మీద ఇలా స్పందించి అందరికీ షాకివ్వడమే కాదు సినిమా రిలీజవక ముందే అమితాబ్ ఇలా వ్యాఖ్యలు చేయడం మెగా ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం అమితాబ్ వ్యాఖ్యలు చులకనగా ఉన్నాయని మన దగ్గర అసలు మల్టి స్టారర్స్ రానట్టుగా చిరంజీవి, మహేష్ లను కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారట. మరి వీళ్ళకి ఇందులో చులకన భావం ఎక్కడ కనిపించిందో అర్థమ అవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: