స్వీటి అనుష్క ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నిన్న సాయంత్రం భాగ్యనగరంలో అనుష్క 15 సంవత్సరాల సినీ జీవిత ప్రస్తానం ఫంక్షన్ చాల స్వీట్ గా జరిగింది. అనుష్క కు హీరోయిన్ గా మొదటి అవకాశం ఇచ్చిన పూరీ జగన్నాథ్ నుండి అనుష్క ను నేషనల్ సెలెబ్రెటీ గా మార్చిన రాజమౌళి వరకు ఆమెతో పనిచేసిన అనేకమంది దర్శకులు ఈ ఈవెంట్ కు వచ్చారు. 


ఈమధ్య గత కొద్ది రోజులుగా అనుష్క ఒక ప్రముఖ దర్శకుడి కొడుకును పెళ్ళి చేసుకోబోతోంది అంటూ వార్తలు రావడంతో ఆమె పెళ్ళి విషయమై వస్తున్న వార్తలకు అనుష్క తో క్లారిటీ ఇప్పించాలని ఈ ఫంక్షన్ కు పూరీతో కలిసివచ్చిన ఛార్మీ తనవంతు ప్రయత్నం చేసింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుమ నుండి ఛార్మీ మైక్ తీసుకుని ‘అనుష్క నీ పెళ్ళి ఎప్పుడు’ అంటూ ఓపెన్ గా ప్రశ్నించిది.


ఈ అనుకోని ప్రశ్నకు ఏమాత్రం షాక్ అవ్వకుండా అనుష్క చిరునవ్వుతో ఛార్మీ వైపు చూస్తూ ‘అదే అర్ధం కావడం లేదు ఇంతకీ నా పెళ్ళి ఎప్పుడు’ అంటూ అనుష్క ఎదురు ప్రశ్నలు వేసింది. దీనితో అందరు నవ్వుతున్న సందర్భంలో దర్శకుడు పూరీ మైక్ తీసుకుని ‘హీరోయిన్స్ పెళ్ళి చేసుకోకుండా ఉండటమే తనకు ఇష్టం’ అంటూ జోక్ చేసి అందర్నీ మరింత నవ్వించాడు. 


ఇక ఈ ఈవెంట్ కు మరొక అతిథి గా వచ్చిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ తనను అందరు మౌన ముని అంటూ ఉంటారని అయితే అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీలో మూగ పాత్రలో నటిస్తూ తన కుటుంబ సభ్యురాలు కాకపోయినా తన మౌన వారసత్వాన్ని కొనసాగించింది అంటూ జోక్ చేసాడు. దీనితో రాఘవేంద్రరావు అనుష్క పెళ్ళి పై వస్తున్న రూమర్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కామెంట్ చేసాడా అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన చాల మంది అభిప్రాయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: