బుల్లితెర కార్యక్రమాలను హోస్ట్ చేసే విషయంలో నాగార్జున స్టైల్ వేరు. తన టాప్ హీరో ఇమేజ్ ని పక్కకు పెట్టి చాల ఆత్మీయంగా మాట్లాడుతూ నాగ్ మన కుటుంబ సభ్యుడా ? అని అనిపించే విధంగా నాగార్జున మాటతీరు బుల్లితెర కార్యక్రమాలను చూసే ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. 


గత సంవత్సరం ‘బిగ్ బాస్ 3’ సీజన్ హోస్ట్ చేసే విషయంలో మొదట్లో నాగార్జున పై విమర్శలు వచ్చినా ఆ తరువాత ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న హౌస్ మేట్స్ పై తన పట్టు పెంచుకుని వారితో ఒక ఆట ఆడుకుంటూ ఆ కార్యక్రమానికి మంచి రెటింగ్స్ నాగ్ తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ‘బిగ్ బాస్ 4’ సీజన్ కార్యక్రమాన్ని మే నెల నుండి ప్రారంభించాలని స్టార్ మా ఆలోచనలు చేస్తోంది.


ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి హోస్ట్ గా వ్యవహరించే విషయంలో వెంకటేష్ రానా విజయ్ దేవరకొండ మహేష్ పేర్లను స్టార్ మా యాజమాన్యం పరిశీలించినా వీరందరిలోనూ ఎదో ఒక లోటు స్టార్ మా యాజమాన్యం దృష్టికి వచ్చినట్లు టాక్. దీనితో యూటర్న్ తీసుకుని స్టార్ మా టీమ్ ‘బిగ్ బాస్ 4’ ను హోస్ట్ చేసే విషయంలో నాగార్జున తో ప్రాధమిక చర్చలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీ షూటింగ్ పూర్తి కావడం నాగార్జున నటించబోయే ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ ఇంకా నాగ్ కోరుకున్న విధంగా పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం నాగార్జున ఖాళీగానే ఉంటున్నాడు. దీనితో నాగార్జున ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి పరిస్థితులు అన్ని విధాల కలిసి వస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ కు సంబంధించి నాగ్ కండిషన్స్ తో పాటు పారితోషిక వివరాలు ఎలా ఉంటాయి అన్న విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: