2017 వ సంవత్సరం లో 'స్టార్ మా' నిర్వహించిన బిగ్ బాస్ షోకి యాంకర్ గా వచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిజం చెప్పాలంటే... జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్రోమోలలో కనిపిస్తున్నప్పుడు... 'హా, ఈయనేం యాంకరింగ్ చేస్తాడులే' అనుకున్నారంతా. కానీ ఒక్క సారి షో ప్రారంభమైన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడే మాటలకు అతని శత్రువులు కూడా అభిమానులుగా మారిపోయారు. ఆయన తేజస్సు, చాతుర్యంగా మాట్లాడే శక్తి, గుండె మీద చేయి వేసి ముచ్చటగా ఇచ్చే పోజు ప్రతి ఒక్కరిని టీవీలకు కట్టిపడేసేలాగా చేశాయి. తారక్ వాక్చాతుర్యం ముందు బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్లు ఎలా చిన్నబోయారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.




అస్సలు బిగ్ బాస్ షో ని చూసింది కేవలం ఎన్టీఆర్ మాత్రం కోసమే అని ఏ డౌటు లేకుండా చెప్పుకోవచ్చు. ఒకానొక బిగ్ బాస్ ఎపిసోడ్ లో యాంకరింగ్ రంగాన్ని ఏలుతున్న సుమ కనకాల పార్టిసిపేట్ చేసింది. అయితే ఎన్టీఆర్ యాంకర్ గా అవతారమెత్తి బుల్లితెర ఎన్నడూ చూడని యాంకరింగ్ టాలెంట్ ని చూపిస్తుంటే... కలవరపడిన సుమ కనకాల మాట్లాడుతూ... 'తమరు యాంకర్ అయ్యిన తరువాత మా బతుకేమిటో అర్దమవట్లేదు. తెలుగు టెలివిజన్ చూసిన గొప్ప యాంకర్లలో మీరు ఒక్కరు' అని తెగ కొనియాడుతోంది. బిగ్ బాస్ 1 సీజన్ తరువాత బిగ్ బాస్ 2 లో హోస్ట్ గా బాధ్యతలు నిర్వహించిన హీరో నాని జూనియర్ ఎన్టీఆర్ అంత రసవత్తరంగా షో ని కొనసాగించ లేక పోయారు. అక్కినేని నాగార్జున కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఏ మాత్రం పోటీ రారు.




కంటెస్టెంట్ లకి కౌంటర్లు వేయటం గానీ, వారిని ఆడుకోవటం లో గానీ, వారిని డిసిప్లేన్ గా ఉంచడంలో గాని జూనియర్ ఎన్టీఆర్ దిట్ట అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. షో లో అతను చూపించిన నవరసాలు ఇప్పటికి ఎవరు మర్చిపోలేరు కూడా. ఒక కథని ఆసక్తికరంగా చెప్పడంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఎవరు సాటిరాలేరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ని బిగ్ బాస్ సీజన్ 4 లో చూడాలని కోట్ల మంది కోరుకుంటున్నారు. దివాలా పడుతున్న బిగ్బాస్ షో కి ఎన్టీఆర్ యాంకరింగ్ ఎంతైనా అవసరం కూడా. ఇంకొక విషయం ఏమిటంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ యాంకర్ గా కొనసాగితే ప్రదీప్, రవి లాంటి వాళ్ల బతుకు ఏమయ్యేదో అనే ఆలోచన అందరికీ రాక తప్పదు.





























మరింత సమాచారం తెలుసుకోండి: