ప్రస్తుతం బుల్లితెర పై ఉన్న యాంకర్ లలో   మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ. ఓవైపు బుల్లితెరపై వివిధ ప్రోగ్రాములు చేస్తూ అదరగొడుతునే..  మరోవైపు వెండితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేసి తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలుగా  మారిపోయిన అనసూయ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ ప్రోగ్రాం తర్వాత అనసూయ ఫేట్  మొత్తం మారిపోయింది అని చెప్పాలి. సాదా సీదాగా షో గా  మొదలైన జబర్దస్త్ ప్రోగ్రాం బుల్లితెరపై సంచలనంగా మారడంతో యాంకర్ అనసూయకు మంచి పేరు కూడా వచ్చింది. అయితే జబర్దస్త్ తర్వాత పలు  షోలు చేసినప్పటికీ యాంకర్ అనసూయకు జబర్దస్త్ తెచ్చిన గుర్తింపు  తేలేకపోయాయి. 

 

 

 ఇక జబర్దస్త్ లోనే కాకుండా వెండితెరపై కూడా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్షణం సినిమాలో  ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన అనసూయ... తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అనే చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయి మరి నటించింది అనసూయ. ఇక ఆ తర్వాత రంగస్థలం సినిమాలో అనసూయ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.  రంగమ్మత్త పాత్రతో అనసూయ ఫేట్  మొత్తం మారిపోయింది అని చెప్పాలి. రంగమ్మత్త పాత్రతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఓ స్థానాన్ని సంపాదించుకున్నది  అనసూయ. ఆ పాత్రతో తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గర అయిపోయింది.

 

 

 అయితే అనసూయ యాంకరింగ్ ఫీల్డ్ కి వచ్చినందుకు అనసూయ తండ్రి చాలా బాధపడ్డాడట. అనసూయకు అన్నదమ్ములు లేరు  ముగ్గురు ఆడపిల్లలే. ఇక అనసూయ తండ్రి అనసూయను ఐపీఎస్ ఆఫీసర్ చేయాలి అనుకున్నారట. ఏకంగా అనసూయ ఐపీఎస్ అనే ఒక ఫోటోను కూడా సిద్ధం చేశారట అనసూయ తండ్రి . ఇక అనసూయ ఎన్సిసి ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో అనసూయ ఐపీఎస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. కానీ ఎంబీఏ చదివిన అనసూయ ఓ  కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేసి ఆ తర్వాత మీడియాలో కి వచ్చి.. జబర్దస్త్ లో  అవకాశం రావడంతో ఎంతగానో  ఎదిగింది. కానీ అనసూయ తండ్రి కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: