యాంకర్ సుమ.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు. ఒక‌టి రెండు కాదు.. రెండు ద‌శాబ్దాలుగా టెలివిజ‌న్ రంగాన్ని మ‌కుటం లేని మ‌హారాణిగా ఏలేస్తుంది సుమ‌. రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి.. గ్లామ‌ర్ షోలు కూడా చేస్తున్న ఈ స‌మ‌యంలో ఇంత సుధీర్ఘకాలం కెరీర్ కొనసాగించడం అంటే చిన్న విష‌యం కాదు. కానీ, సుమ మాత్రం అది సాధ్యం చేసి చూపించింది.  ఇప్పుడు ఈమె తన ఇమేజ్‌ను బుల్లితెరతో పాటు సోషల్ మీడియా, డిజిటల్‌‌కు కూడా పాకేలా చేసింది. అయితే అప్పట్లో సుమతో పాటుగా మరో టాప్ యాంకర్ ఝాన్సీ కూడా కనిపించే వారు.

 

యాంకర్ గా, నటిగా ఝాన్సీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలో డైలాగ్స్ అద్భుతంగా చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. యాంకరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నటిగా అవకాలు అందుకుంది. సామజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలకు ఝాన్సీ పనిచేసింది. ఇక ఎక్కువగా సుమ, ఝాన్సీల‌ షోలే తెలుగు ప్రేక్షకులకు కనిపించేవి. కానీ వీరిద్దరికీ మాత్రం తాను గట్టి పోటీ ఇచ్చే వాడిని అని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రముఖ సంగీత దర్శకుడుగా, గాయకుడుగా, నటుడుగా, యాంక‌ర్‌గా, డబ్బింగ్ కళాకారుడుగా మరియు గీత రచయితగా ర‌ఘు మంచి పేరే సంపాదించుకున్నారు. 

 

తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో పనిచేశాడీయ‌న‌. అయితే ఇటీవ‌ల ఇంటర్వ్యూలో ఈయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట పెట్టారు. తాను సంగీత దర్శకత్వంలోకి పూర్తి స్థాయిలో దిగక ముందు హైదరాబాద్ లో హీరోలకు డబ్బింగ్ చెప్పేవాడిన‌ని.. ఆ టైమ్‌లోనే యాంక‌ర్‌గా కూడా చేసాన‌ని చెప్పారు. ఇక అప్ప‌టికే  సుమ, ఝాన్సీలు యాంకర్లుగా బాగా రాణిస్తాన్నారని.. అప్పుడు మేల్ యాంకర్ నేనెక్కొడినే.. అప్పుడు నాకు తిరుగు లేకుండా పోయిందని అప్పుడు మా మధ్యనే చాలా టఫ్ కంపిటిషన్ ఇచ్చేవాడినని వారే అనేవారని రఘు చెప్పుకొచ్చాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: