రాబోతున్న ఉగాది తరువాత వచ్చే రామ్ చరణ్ పుట్టినరోజునాడు ఈ మూవీలోని చరణ్ లుక్ తో పాటు ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ ను అధికారికంగా ప్రకటించాలి అని రాజమౌళి చేస్తున్న ఆలోచనలకు ఒక అజ్ఞాత వ్యక్తి ఊహించని షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ఆలోచనలలో ఉన్న ‘రఘుపతి రాఘవ రాజారామ్’ టైటిల్ ను కొన్ని నెలల క్రితం రాజమౌళికి కూడ తెలియకుండా ఒక చిన్న నిర్మాత ఫిలిం చాంబర్ లో రిజిష్టర్ చేసినట్లు రాజమౌళికి చాల ఆలస్యంగా తెలిసినట్లు టాక్.


దీనితో షాక్ అయిన రాజమౌళి ఈ టైటిల్ ను తమకు ఇమ్మని నిర్మాత దానయ్య ద్వారా రాయబారాలు చేయిస్తే ఆ నిర్మాత ఏకంగా కోట్లల్లో డబ్బు అడుగుతున్నట్లు టాక్. ఈ డిమాండ్ విని రాజమౌళి తన ఆలోచనలు మార్చుకుని తన మనసులో ఉన్న మరొక టైటిల్ ‘రామ రావణ రాజ్యం’ పై ఆలోచనలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. 


అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కథ స్వాతంత్రోద్యమ నేపధ్యంలో కొనసాగుతుంది కాబట్టి ముందుగా అనుకున్న ‘రఘపతి రాఘవ రాజారామ్’ టైటిల్ ను పొందడానికి ఆ నిర్మాతతో రాయబారాలు చేసే విషయంలో ఇండస్ట్రీకి సంబంధించిన కొందరు ప్రముఖ నిర్మాతల సహకారాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త ఇలా వైరల్ కావడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ చరణ్ పుట్టినరోజునాడు కూడ విడుదల అవ్వడం కష్టమే అంటూ రూమర్స్ వస్తున్నాయి. 

 

దీనికితోడు ఈ సినిమాను అనేక భాషలో విడుదల చేస్తూ ఆఖరికి బెంగాలి భాషలో కూడ డబ్ చేసి విడుదల చేస్తున్న పరిస్థితులలో అన్ని భాషల ప్రేక్షకులకు అర్థం అయ్యే ఒక క్యాచింగ్ టైటిల్ దొరకడం అంత సులువైన పని కాదు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈ మూవీకి ఏర్పడ్డ టైటిల్ సమస్యలు అంత సులువుగా పరిష్కారం కావు అన్న కామెంట్స్ నినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: