బుల్లితెర మీద తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ అందుకొని ప్రతీ ఇంటికి పరిచయం అయిన యాంకర్లు వెండితెర మీద మాత్రం సత్తా చాటలేకపోతున్నారు. అసలు యాంకర్లు హీరోలుగా మారితే ఏ మాత్రం బజ్‌ క్రియేట్ అవ్వటం లేదు. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి రోజు టీవీల్లో కనిపించే వారిని ప్రత్యేకంగా వెండితెర మీద చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించటం లేదు. దీంతో యాంకర్లు హీరోలుగా నటించిన సినిమాలు ఏమాత్రం బజ్‌ క్రియేట్ కావటంలేదు.

 

గతంలో స్టార్ యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన రవి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇది మా ప్రేమ కథ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా ఆడియన్స్‌కు తెలియకముందే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఆ తరువాత రవి మరో సినిమా కూడా చేసి ఈ సినిమాకు సంబంధించి కూడా ఎలాంటి చడీ చప్పుడూ లేదు.

 

ఇటీవల హీరోగా మారిన మరో యాంకర్‌ సుడిగాలి సుధీర్‌. ఈటీవలో ప్రసారమైన జబర్థస్త్ షోతో పరిచయం అయిన సుధీర్‌, ఇటీవల సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. రిలీజ్ కు ముందు ఈ సినిమాకు సంబంధించి కాస్త బజ్‌ క్రియేట్‌ అయినా రిలీజ్ తరువాత మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. దీంతో సుధీర్‌ కూడా యాంకరింగ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫెయిల్ అయ్యాడు.

 

తాజాగా మరో స్టార్ యాంకర్‌ ప్రదీప్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఈ సినిమా నెలాఖరున రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమాతో ప్రదీప్‌ అయిన ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: