ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ సుమ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్  యాంకర్ గా కొనసాగుతూ దూసుకుపోతుంది సుమ కనకాల. అయితే ప్రస్తుతం ఏ సినిమా ఈవెంట్  చూస్తున్నా సుమా నే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏ ఛానల్లో చూసినా గ్యారెంటీగా సుమ కనకాల ఓ షో  చేస్తూ ఉంటుంది. ఇక సుమ ఏ షో చేసినా దానికి ప్రేక్షకాదరణ మాత్రం భారీగానే ఉంటుంది. ఎందుకంటే సుమ తన వాక్చాతుర్యంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షితులను చేయగలదు యాంకర్ సుమ. అందుకే ఇప్పటివరకు సుమారు చేసిన అన్ని ప్రోగ్రామ్స్  మంచి విజయం సాధించాయి. 

 

 

 అయితే సుమా తెలుగులో మొదట హీరోయిన్ గా ప్రస్థానం ప్రారంభించిన విషయం తెలిసిందే. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది యాంకర్ సుమ. అయితే కెరీర్ మొదట్లో సినిమాల్లో హీరోయిన్గా నటించిన సుమ తర్వాత రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత సుమ కొంచెం కొంచెంగా సినిమాలకు దూరం పెడుతూ వచ్చింది . అయితే సుమ సినిమాలకు దూరం పెట్టడానికి గల కారణం సుమ దూరదృష్టితో ఆలోచించటమే అని చెబుతున్నారు సినీ  విశ్లేషకులు. ఎందుకంటే సినిమా అన్న తర్వాత అవుట్ డోర్ షూటింగ్ లు... హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్... కెమిస్ట్రీ... ఇలాంటివి చాలా ఉంటాయని.. ఇలాంటి వాటివల్ల దాంపత్య జీవితం భంగ పడుతుంది అని దూరదృష్టితో ఆలోచించి సుమ సినిమాలకు దూరం పెట్టినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

 

 

 అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అందానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను ఎక్స్ట్రార్డినరీ అందగత్తెను  కాదు అని.. కానీ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని అని తనకు తాను ఆలోచించుకుని సుమ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు. కానీ సుమా  బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: