టాలీవుడ్ లో మాస్ మహరాజు గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రవితేజ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్నాడు.  అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న  రవితేజ తర్వాత వరుస అపజయాలతో తెగ ఇబ్బంది పడుతున్నాడు. అయితే కథల విషయంలో ఎప్పుడూ ఎంతో జాగ్రత్తలు తీసుకునే రవితేజ ఇలా వరుసగా ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారో తెలియని అయోమయ పరిస్థితి.  అయితే గతంలో తనకు బలుపు లాంటి సూపర్ హిట్ అందించిన గోపిచంద్ మలినేని తో ఇప్పుడు ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నాడు. పోలీస్ నేపథ్యంలో వచ్చే ఈ మూవీ లో రవితేజ ఓ పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట. ఇందులో బలుపు హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది. 


అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ చేశారు.  సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సంపాదిస్తుంది.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తన నెక్స్ట్ సినిమాను కూడా ఇదే స్పీడ్ లో పట్టాలెక్కించాలని చూస్తున్నాడు రవితేజ.  త్రినాద్ నక్కిన దర్శకత్వం లో రవితేజ ఓ  సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా వెరైటీగా ఉండబోతుందట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన వర్క్ మొదలు పెట్టేశారట. ఇందులో రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతుందట. 


గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘బెంగాల్ టైగర్’ వచ్చింది. కాకపోతే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అంతే కాదు ఈ మూవీ తర్వాత రవితేజ ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మరోసారి ఈ జోడి సందడి చేయనున్నారు. కాగ రవితేజ ఆశలన్నీ ప్రస్తుతం తను చేస్తున్న 'క్రాక్' సినిమాపైనే ఉన్నాయి. అభిమానులు ఎలా కోరుకుంటారో అలానే గోపీచంద్ మలినేని రవితేజని చూపించనున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: