టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో సుమా ఒకరు. ఆమె తర్వాతే ఎవరు అయినా సరే. తెలుగు బుల్లి తెర మీద ఇదే అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సుమా. ఇప్పుడు టాలీవుడ్ యాంకర్స్ లో ఎవరైనా సరే ఆమె తర్వాతే. ఆ విధంగా సుమా దూసుకుపోతుంది. అగ్ర హీరోల సినిమా కార్యక్రమాలకు సుమా లేకపోతే బోసి గా ఉంటుంది అంటూ పలువురు నిర్మాతలు కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా తన మార్క్ వేసారు సుమా. ప్రముఖ టీవీ చానల్స్ అన్ని కూడా సుమా కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. 

 

ఆమె యాంకరింగ్ కి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు అనేది వాస్తవం అయితే ఆమెకు స్వార్ధం ఎక్కువని అంటున్నారు కొందరు. ఆమె మినహా ఎవరూ పైకి రావొద్దు అనే స్వార్ధం ఆమెలో ఉంటుందని, తనకు ఉన్న పరిచయాలతో ఆమె ఎక్కువగా అవకాశాలను పొందుతుంది అంటున్నారు. ఒకవేళ తనను కాకుండా ఎవరిని అయినా తీసుకుంటే ఆమెకు నచ్చదని, ప్రముఖ టీవీ చానల్స్ అయినా సరే ఆమెకే ప్రాధాన్యత ఇవ్వాలని కాస్త యాటిట్యూడ్ కూడా ఆమెకు ఎక్కువే అంటున్నారు. 

 

దీనితోనే ఆమెతో షోస్ చేసే నిర్వాహకులు సుమాతో చాలా జాగ్రత్తగా ఉంటారని, ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటారని అంటారు. ఇటీవల ఆమెను కాకుండా ఒక షోకి అనసూయని ఎంపిక చేయడం సుమాకు అసలు నచ్చలేదని, ఆ తర్వాత సదరు షో నిర్వాహకులు ఆమెను సంప్రదించినా సుమా మాత్రం నో చెప్పిందని అంటున్నారు. మళ్ళీ ఆ నిర్వాహకులతో ఆమె టచ్ లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదని, టాలీవుడ్ లో ఆ విధంగా సుమా హవా కొనసాగుతుంది అంటున్నారు. ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చినా సరే ఆమె మాత్రం ఒప్పుకోలేదని సినిమాల్లో చేయడానికి తనకు ఆసక్తి లేదని చెప్పెసిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: