ప్రభాస్ తనతో నటించే హీరోయిన్స్ చాల గౌరవ ప్రదంగా ఉంటాడని చాలామంది అంటూ ఉంటారు. దీనికితోడు ప్రభాస్ తనతో కలిసి నటించే హీరోయిన్స్ కు చేసే అతిథి మర్యాదలు తట్టుకోవడం చాల కష్టం అని బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దీనితో ప్రభాస్ తో నటించే విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు అభ్యంతరాలు చెప్పరు. 


ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ ప్రభాస్ తో నటించే విషయంలో వ్యక్త పరిచిన అభ్యంతరం బాలీవుడ్ మీడియాలో సంచలన వార్తగా మారింది. ప్రభాస్ తో ఒక సైన్స్ ఫ్యాంటసీ మూవీని తీయబోతున్న నాగ్ అశ్విన్ తన మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి నటీనటుల ఎంపిక కొనసాగిస్తూ హీరోయిన్ గా ఎవర్ని ఎంపిక చేయాలని అన్న చర్చలు జరిగినప్పుడు ప్రభాస్ నోటివెంట కత్రినా కైఫ్ అలియా భట్ ల పేర్లు వచ్చినట్లు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 


హీరోయిన్స్ విషయంలో ప్రభాస్ చెప్పిన సూచనలలో పరిశీలనకు వచ్చిన అలియా భట్ పేరు నాగ్ అశ్విన్ కు బాగా నచ్చడంతో ఆమెను కలిసి తాను ప్రభాస్ తో తీయబోయే మూవీ కథను వినమని కోరినట్లు టాక్. అయితే అలియా భట్ సున్నితంగా ఈ విషయాన్ని తిరస్కరిస్తూ ప్రస్తుతం తన లైఫ్ సెటిల్ మెంట్ దశలో ఉందని ఇప్పటికే ఫిక్స్ అయిన బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో తన పెళ్ళి డేట్ గురించి ఎదురుచూస్తున్నానని చెపుతూ పెళ్ళి తరువాత తన సినిమాల విషయంలో చాల గ్యాప్ ఉంటుంది అని సంకేతాలు ఇచ్చినట్లు టాక్. 


దీనితో అలియా భట్ పై చాల ఆశలు పెట్టుకున్న నాగ్ అశ్విన్ ఆశలు అడియాసలు అయ్యాయి అని అంటున్నారు. త్రివిక్రమ్ మూవీలో కూడ జూనియర్ పక్కన అలియా భట్ ను ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న సూచనలు వస్తున్న పరిస్థితులలో అలియా భట్ సెటిల్ మెంట్ ఆలోచనలు ప్రభాస్ కు జూనియర్ కు ఊహించని షాక్ అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: