యాంకర్ సుమ చక్కని పదజాలంతో, మంచి నవ్వుతో, గౌరవంగా మాట్లాడమే కాక చక్కటి దుస్తుల్ని ధరించి ఇలా ఉండాలి  అనుకునే అంత మంచి యాంకర్ మన సుమ. ఈమె మాతృ భాష తెలుగు కానప్పటికీ తెలుగులో చక్కగా మాట్లాడుతుంది. స్టార్ మహిళతో సుమ మరెంతగానో ఫేమస్ అయ్యిపోయింది. చక్కగా యాంకరింగ్ చెయ్యడం మాత్రమే కాకా మంచి నటి, గాయని కూడా. స్టార్ మహిళని అన్ని రోజులు కొనసాగించి మంచి ప్రోగ్రామ్ని సుమ యాంకరింగ్ చెయ్యడం విశేషం.

 

IHG

 

మొదట ఆమె మలయాళం సినిమాలలో నటించింది. తెలుగు సినిమాలలో కూడా సుమ నటించింది. చాల బాగుంది, కలిసి నడుద్దాం, వర్షం, బాద్షా, ఓ బేబీ వంటి సినిమాలలో నటించింది సుమ. నంది అవార్డు, లింకా ఫ్రీస్ ఫేస్ అవార్డు, స్టార్ మహిళా యాంకర్కి గాను ఓ అవార్డు దక్కించుకుంది . ఇలా సుమ పలు అవార్డుని దక్కించుకుంది. 

 


సుమ అప్పటి నుండి ఇప్పటి దాక అదే బ్యూటీతో టీవి లో చెయ్యడం నిజంగా ఓ గొప్ప విషయమే. కానీ సుమతో పోటీ అప్పటి నుండి ఇప్పటి వారు కూడా పడుతూనే ఉన్నారు. కానీ సుమకి సుమే పోటీ అంటూ దూసుకుని వెళ్ళిపోతోంది. మహిళలు మహారాణులలో రోజా అలానే వివిధ ప్రోగ్రామ్స్తో మరికొంత మంది వచ్చారు కానీ సుమ అనుభవం ముందు ఏ యాంకర్ కూడా దాట లేకపోయారు.

 

IHG

 

 

అప్పట్లో ఝాన్సీ కూడా మంచి ఫార్మ్లో ఉండడం వల్ల సుమకి కాంపిటీషన్ ఇస్తుందేమో అనుకున్నారు కానీ అదేం జరగలేదు. మేల్ యాంకర్ ప్రదీప్ ఫార్మ్లో ఉంటున్నా సుమ దారి సుమదే. క్యాష్ వంటి ప్రోగ్రామ్స్తో సుమ చక్కగా తన పనిని సాగిస్తోంది. పోటీ లేకుండా అవకాశాలని  ఇంకా పెంచుకుంటూ సాగిపోతోంది సుమ.  

మరింత సమాచారం తెలుసుకోండి: