ఉదయ భాను చక్కటి యాంకర్. ఆమె పదవ తరగతి చదువుతున్నప్పుడే ఆమెకి అవకాశం లభించింది. మొదట ఆమె కన్నడ సినిమాలో నటించింది. ఎర్ర సైన్యం తో ఆమె ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. మొదట వచ్చినప్పుడే  ఉదయ భాను మంచి అభిమానం సొంతం  చేసుకుంది. ఈటీవీ లో ఆమె ఒక ప్రోగ్రాంలో యాంకర్గా చేసింది. ఆమె ఆ హృదయాంజలి ప్రోగ్రాంలో అందరి వద్దకి వెళ్లి ఆమె మాట్లాడాలి.

 

IHG

 

సరదాగా మాట్లాడించి మంచిగా నవ్వించేది ఉదయ భాను. గలగల మాట్లాడడం ఆమెకి ఉన్న ట్యాలెంట్. లీడర్, కొండపల్లి సింహం, జులాయి, శ్రావణమాసం, ఖైదీ బ్రదర్స్ చిత్రాలలో నటించింది ఉదయభాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జులాయి సినిమాలో ఆమె ఒక పాటకి డాన్స్ చేసింది. ఇలా ఆమె తన కెరీర్ని చక్కగా పెంపొందించుకుంటూ వచ్చింది.

 

హృదయాంజలి, సాహసం చేయరా డింభకా, డాన్స్ బేబీ డాన్స్, ఢీ రియాలిటీ డాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు. ఇలా పలు ప్రోగ్రామ్స్లో యాంకర్గా చేసింది ఉదయ భాను. ఉదయ భాను తండ్రి మంచి కవి. అయన కలం పేరు ఉదయ భాను. ఆ తర్వాత అయన తన కూతురికి కూడా ఉదయ భాను అని పేరు పెట్టాడు. చక్కగా యాంకరింగ్ చెయ్యడం మాత్రమే కాకా మంచి నటిగా, డాన్సర్గా కూడా ఉదయ భాను ప్రదర్శించింది.

 

IHG

 

చాలా సంవత్సరాలు కొనసాగించి మంచి ప్రోగ్రామ్స్తో  ఉదయ భాను  చేసింది.  ఉదయ భాను 15  వ ఏటనే తనకి ఇష్టం లేకుండానే ఒక ముస్లిం వ్యక్తితో తన తల్లి వివాహం చేసింది. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత విజయ్ కుమార్ని వివాహం చేసుకుంది తన తల్లికి ఇష్టం లేకుండా. ఇలా ఎన్నో జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: