కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో నైజాం మార్కెట్ బాగా పెరిగిపోతోంది. ఒక‌ప్పుడు కేవ‌లం అక్క‌డ పెద్ద హీరోల సినిమాలు రు. 15 కోట్లు ప‌లికేవి. ఆ త‌ర్వాత అవి రు. 18 - 20 కోట్ల‌కు చేరుకున్నాయి. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే రేట్లు పెంచుకోవ‌డం అద‌న‌పు షోలు వేసుకోవ‌డం ఇక్క‌డ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ యేడాది సంక్రాంతికి పోటీగా వ‌చ్చిన బన్నీ సినిమా 18 కోట్లకు, మహేష్ సినిమా 20 కోట్లకు అమ్మారు. అయితే బ‌న్నీ సినిమా ఏకంగా రు. 40 కోట్ల షేర్ రాబ‌ట్టింది. మ‌రి మ‌హేష్ సినిమా బ‌న్నీ సినిమా కంటే కాస్త త‌క్కువ గానే వ‌సూళ్లు రాబ‌ట్టింది.



ఇక రాజ‌మౌళి సినిమా ల విష‌యానికి వ‌స్తే ఈ సినిమా ఆర్.ఆర్.ఆర్ రేటు రు. 75 కోట్ల‌తో పాటు జీఎస్టీ లెక్క‌లు కూడా క‌లిపి ఉన్నాయ‌ట‌. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఎంత ప్ర‌తిష్టాత్మ‌క సినిమాగా తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా నైజాం రైట్స్ ఇప్పుడు టాప్ లేపుతున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌..?  ఈ సినిమా నైజాం రైట్స్ రు. 40 కోట్లు చెపుతున్నార‌ట‌. నలభై రాకపోయినా, 35కు తగ్గరు అని టాక్.



ఇటు చిరు, రామ్ చ‌ర‌ణ్ సినిమాలో ఉన్నారు.. పైగా కొర‌టాల శివ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఆ రేటు అడుగుతున్నార‌ట‌. మ‌ధ్య‌లో ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ పాత్ర కోసం మ‌హేష్‌బాబును తీసుకుంటార‌ని కూడా టాక్ వ‌చ్చింది. చివ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తేడాలు అవి ఆలోచించుకుని ఇప్పుడు రామ్‌చ‌ర‌ణే స్వ‌యంగా న‌టిస్తున్నాడ‌ట‌. ఏదేమైనా ఈ రేటు చూస్తే మెగాస్టార్ అస‌లు సిస‌లు స్టామినా ఏంటో మ‌రోసారి ఈ వ‌య‌స్సులో కూడా ఫ్రూవ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో పట్నం నుంచి అడవికి వచ్చి ఆచార్యకు శిష్యుడిగా మారే పాత్రను రామ్ చరణ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: