ప్రస్తుతం విడుదల అవుతున్న ప్రతి సినిమాకు ఎదో ఒక వివాదం అంటగడుతున్నారు. ఫలానా సినిమాలో ఫలానా క్యారెక్టర్ మా మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉందనో, అలా మాట్లాడిందనో, లేక సినిమా టైటిల్ మా మనోభావాలకి విరుద్ధంగా ఉందనో ఎదో ఒక కారణంచేప్పి సినిమాలని ఆపేయాలని, లేదా సినిమాలో కొని సీన్స్ తీసేయాలని గొడవ చేస్తుండడం  సహజంగా మారింది. 

 

 

 

అయితే సాధారణంగా సినిమా విడుదలకి ముందు ఇలాంటి గొదవలు జరుగుతుంటాయి. కానీ సినిమా విడుదలై, థియేటర్లలో నుండి తీసేస్తున్న టైమ్ లో గొడవ చేయడం భీష్మ విషయంలో జరిగి ఉంటుంది. భీష్మ సినిమా టైటిల్ మార్చాలంటూ గంగపుత్ర సంక్షేమ సంఘం వారు ఆరోపించిన వార్త తెలిసిందే. ఈ సినిమాలో కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, భీష్మ అనే పేరును చెడగొట్టేలా ఉన్నాయని అందువల్ల ఆ సీన్లన్ తొలగించాలని వారు ఆరోపించారు.

 

 

అయితే వారి ఆరోపణల్ని పట్టించుకోని సినిమా నిర్మాతలు సినిమాని అదే పేరుతో విడుదల చేసేశారు. ఈ చిత్రం ప్రేక్షకుల దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్ళు సాధించింది. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా గంగపుత్ర సంక్షేమ సంఘం వారు భీష్మని వదలట్లేదు. భీష్ముడిని ఆరాధించే మా మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయంటూ మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశాడు.

 

 

మరి దీనిపై మానవహక్కుల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో తెలియడం లేదు. సినిమా విడుదలై థియేటర్లలో నుండి వెళ్ళిపోయాక కూడా ఇంకా దాని గురించి రచ్చ చేయడం ఏంటని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు ఇదంతా తమ పాపులారిటీని పెంచుకోవడం కోసమే అని అంటున్నారు. మరి మానవ హక్కుల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: