ఒక్కో సినిమాకి ఒక్కో విధంగా ప్రమోట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సినిమాల్ని తీసేస్తున్నారు. కానీ తమ సినిమాని ప్రేక్షకులు చూడగలిగేలా ఆసక్తి కలిగించే విద్య కొంతమందికే ఉంటుంది. నేటి సమాజంలో అలాంటి టాలెంట్ ఉన్నవాళ్లే నెగ్గుకు రాగలుగుతున్నారు. సినిమా తీసి దాన్ని రిలీజ్ వరకి తీసుకొచ్చి, ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా ప్రమోట్ చేయడం చిన్న విషయం కాదు.

 

 

అయితే ఆ ప్రమోషన్ ని ప్రతీ ఒక్కరూ సీరియస్ గా తీసుకుంటారు. చిన్న సినిమాలు తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడంలోనే వెనకబడి హిట్ కావాల్సిన చిత్రాల్ని సైతం ఫ్లాప్ చేసుకుంటున్నాయి. అందుకే పెద్ద చిత్రాలు ప్రమోషన్ విషయంలో ఏమాత్రం రాజీపడవు. సినిమా విడుదల దగ్గర పడుతుందంటే ప్రతీ ఒక్కరూ అలర్ట్ అయిపోయి ప్రమోషన్లకే అంకితం అయిపోతారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనీ, మ్యూజికల్ నైట్స్ అనీ ఏదో ఒక పేరు చెప్పి ప్రేక్షకుడి దృష్టి తమ సినిమా మీదే ఉండేలా చేసుకుని థియేటర్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.

 


ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే నిన్న అనుష్క టాలీవుడ్ కి వచ్చి పదిహేను సంవత్సరాలు అయిన కారణంగా సెలెబ్రేషన్ చేశారు. ఈ సెలెబ్రేషన్ కి టాలీవుడ్ లోని అగ్ర దర్శకులతో పాటు అగ్ర నిర్మాతలందరూ వచ్చారు. టాలీవుడ్ మొత్తం అక్కడే ఉందని చెప్పినా అతిశయోక్తి కాదేమో.. అయితే హీరోయిన్ గా పదిహేను సంవత్సరాలు ఉండడం అంటే చిన్న విషయమేమీ కాదు.

 

అందుకోసం ఖచ్చితంగా అభినందించాల్సిందే. అయితే ఇక్కడ కేవలం అభినందనల కోసమే ఈ సెలెబ్రేషన్ జరగలేదనే విషయమ్ అర్థం చేసుకోవాలి. అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కి ఊహించినంత స్పందన రాలేదు. దాంతో సడెన్ గా సినిమా మీద ప్రేక్షకుల ఫోకస్ రావడానికే ఈ పదిహేను సంవత్సరాల పండగ చేసినట్టు క్లియర్ గా అర్థం అవుతుంది. మరి ఈ పండగతోనైనా నిశ్శబ్దం సినిమాకి అనుకున్నంత బజ్ వచ్చిందా అనేది సందేహమే.

మరింత సమాచారం తెలుసుకోండి: