టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న, ఫస్ట్ మూవీ తోనే మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత నాని సరసన దేవదాసులో నటించి ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆపై టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ సరసన బ్లాక్ బస్టర్ హిట్ గీత గోవిందంలో నటించి మరొక హిట్ కొట్టింది. ఆ తరువాత నుండి టాలీవుడ్ లో రష్మికకు మంచి పేరు తో పాటు మరిన్ని అవకాశాలు లభించాయి. 

 

ఇక ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ మహేష్ సరసన హీరోయిన్ గా సరిలేరు నీకెవ్వరులో ఛాన్స్ కొట్టి, మరొక విజయం అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం బన్నీ, సుకుమార్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మొదటి నుండి కూడా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన ఫ్యాన్స్ తో అందుబాటులో ఉండే రష్మిక, తన ఫ్యామిలీ లైఫ్ తో పాటు సినిమాలకు సంబందించిన విషయాలను కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక నేటితో రష్మిక ట్విట్టర్ లో ఫాలోవర్లు ఏకంగా 1 మిలియన్ కు చేరడం జరిగింది. 

 

వాస్తవానికి ఆమెతో పాటు మరికొందరు టాలీవుడ్ హీరోయిన్స్ కు కూడా మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నప్పటికీ, రష్మిక మాత్రం ఈ ఫీట్ ని ఎంతో త్వరగా అందుకున్న హీరోయిన్ గా ఒక కొత్త రికార్డు ని నెలకొల్పిందని, సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని వరుసగా సక్సెస్ లతో దూసుకుపోతున్న రష్మిక, రాబోయే రోజుల్లో మరిన్ని హిట్స్ అందుకుని బంగారు భవిష్యత్తుతో ముందుకు సాగాలని పలువురు అభిమానులు ఆమెకు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: