అక్కినేని నాగ చైతన్య సమంతల పెళ్లి అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా వారు మాత్రం ఓ బిడ్డకు తల్లిదండ్రుల అయ్యేందుకు ఇప్పటికీ సిద్ధంగా లేరు. కానీ మీడియాలో మాత్రం సమంత గర్భం ధరించిందని త్వరలోనే ఓ మగబిడ్డకు జన్మనిచ్చినవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. నెటిజన్ల కూడా ఆమె లైవ్ లోకి రాగానే మేడం మీరు ఎప్పుడు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు? అని విసిగిస్తున్నారు. దాంతో ఆమె చాలా సందర్భాలలో కోప్పడింది కూడా. అయినా కావాలనే కొంతమంది పుకార్లు సృష్టించి సామ్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. మొన్నీమధ్య ఆమె ఓ తమిళ భారీ ప్రాజెక్టు సినిమా నుండి తప్పుకుంటున్నానని చెప్పినందుకు మీడియా వాళ్లే సమంత గర్భవతి అయిందని... తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోందని అందుకే ఈ భారీ ప్రాజెక్ట్ నుండి వైదొలగిందని తమ ఇష్టారాజ్యంగా స్టోరీలను వండేశారు.




అయితే ఈ వార్తలన్నీ ఒట్టి అబద్ధమని నాగచైతన్య, సమంత ఘాటుగానే ఖండించారు. సాక్షాత్తు సమంతనే తాను గర్భం ధరించలేదని చెప్పినప్పటికీ చాలా మంది ఆమె మాటలను నమ్మలేదు. అయితే కేవలం ఓ సినిమా నుండి వైదొలగడం వల్ల ఆమె గర్భవతి అని దృష్ప్రచారం చేయడం ఎంత తప్పో ప్రస్తుతం ఒక వార్త చెప్పకనే చెబుతుంది.





వివరాలు తెలుసుకుంటే... సమంత అక్కినేని సినిమాలకి దూరంగా ఉండటం లేదు. ఆమె ఆల్రెడీ ఒక సినిమాకి ఒప్పుకోని షూటింగ్ పనులలో నిమగ్నమై అయ్యింది. తాప్సీ నటించిన గేమ్ ఓవర్ చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ సమంతాకి ఒక స్క్రిప్ట్ ని వినిపించగానే అది సమంతాకి నచ్చిందని, అందుకే వెంటనే అతని దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేసేందుకు ఒప్పుకుందని సమాచారం. సోనీ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. సినిమా కేవలం తెలుగు భాషలో తెరకెక్కనుంది. ఏది ఏమైనా గతంలో విడుదలైన జాను సినిమా సమంత అక్కినేని కు షాక్ ఇవ్వడంతో ఆమె ఒక నెలపాటు వేచిచూసి చివరికి ఒక మంచి స్క్రిప్ట్ ని ఎంపిక చేసుకుందే తప్ప గర్భం దాల్చలేదని స్పష్టమైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: