టాలీవుడ్ లో స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలకు హిట్ ఫ్లాప్ తో ఏ మాత్రం సంబంధం ఉండదు. ఆయన క్రేజ్ అలా ఉంటుంది. ఇక ఆయన సినిమా అంటే నిర్మాతలకు లాభాల పంట. అందుకే టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు త్రివిక్రమ్ తో సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ రెండు వరుస హిట్ ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది. 

 

ఇప్పటికె ఎన్టీఆర్ తో సినిమా కోసం ఇతర హీరోలను కూడా పక్కన పెట్టాడు త్రివిక్రమ్. మహేష్ బాబు లాంటి హీరో అడిగినా సరే అతను సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాను చేసారు త్రివిక్రమ్. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో కష్టపడుతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా కథ విషయంలో ఇప్పటికి ఒక అంచనాకు రాలేదు త్రివిక్రమ్. రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ని చూపించాలని భావిస్తున్నాడు. 

 

అయితే ఆ లుక్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అతను అంచనాకు రాలేదట. దీనితో బాలీవుడ్ లో తనతో సన్నిహితంగా ఉండే ఒక స్టార్ దర్శకుడ్ని కలిసి లుక్ విషయంలో చర్చలు జరిపినట్టు సమాచారం. త్రివిక్రమ్ ఆలోచనను ఆ దర్శకుడికి చెప్పగా ఆ దర్శకుడు కూడా పలు లుక్స్ ని సూచించారని టాక్. దీనిపై త్వరలోనే ఒక అంచనాకు వచ్చి ఎన్టీఆర్ కి కూడా చూపించి అప్పుడు ఓకే చెయ్యాలని భావిస్తున్నాడట. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చెయ్యాలని చూస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: