ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ నిర్మాతలుగా మారే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల మార్కెట్ ఈ విధంగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రధానంగా అగ్ర హీరోలు అయితే చిన్న హీరోలతో సినిమా చేయడం మరో స్టార్ హీరోతో సినిమాలు చేయడం వంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారని అంటున్నారు. కొన్ని కొన్ని సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించే ప్రయత్నం చేయడంతో పాటుగా చిన్న హీరోల సినిమాలను ప్రమోట్ చేసే బాధ్యతలను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. 

 

దీని ద్వారా మార్కెట్ భారీగా పెరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్మాణ రంగంలో అడుగు పెట్టే సూచనలు కనపడుతున్నాయి. ఆయన తన తండ్రి పేరుతో ఒక నిర్మాణ సంస్థను స్థాపించే యోచనలో ఉన్నారని అంటున్నారు. చిన్న కుమారుడు భార్గవ్ హరీ పేరుతో ఒక సినిమా నిర్మాణ సంస్థ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు కూడా అంటున్నాయి. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థలో తొలి సినిమాను నానీ తో చేసే ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే నానీ తో చర్చలు కూడా జరపగా అందుకు నానీ కూడా ఓకే చెప్పారని అంటున్నారు. 

 

త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాను ఒక అగ్ర దర్శకుడి సారధ్యంలో వస్తుంది అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ కూడా దాదాపుగా సిద్దమైంది అంటున్నారు. వచ్చే వేసవి తర్వాత ఈ సినిమాను మొదలుపెట్టే సూచనలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. ఈ సినిమా కు సంగీత దర్శకుడిగా మణిశర్మ వ్యవహరించే అవకాశం ఉందని టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే, ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: