తెలుగు సినిమా ప్రముఖ దర్శకుడు, దిల్ రాజు పరిచయం అవసరం లేదేమో, కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో రారాజు అతడు. దిల్ సినిమాతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న రాజు.. దిల్ రాజుగా మారిన అతని ప్రయాణం గురించి టాలీవుడ్లో ఏ చెట్టునడిగినా, ఏ పుట్టనడిగినా విడమర్చి, మైమరచి మరి చెప్తాయి అతని విజయ కేతనం గురించి... 

 

IHG

 

శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మించి, ఆ బ్యానర్ కే వన్నె చేకూర్చిన నిర్మాత అతడు. ఇక దిల్ రాజు సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి వెళ్లి చూడొచ్చనే భావన ప్రేక్షకులలో కలదు. అందువలనే అతని సినిమా రిలీజు అవుతుందంటే.. కుటుంబాలతో సహా హుషారుగా సినిమాలకు చిన్న.. పెద్ద తేడా లేకుండా ధియేటర్ కు పరుగులు తీస్తారు. 

 

తన నిర్మాణంలో ఎన్నో అద్భుత, అజరామర విజయాలను సొంతం చేసుకున్న దిల్ రాజు ఎందరికో ఆదర్శ ప్రాయుడు. ఇక ఇటీవల ఆయన తన తమ్ముళ్లను కూడా సినీ ఇండస్ట్రీకి నిర్మాతలుగా పరిచయం చేసాడు. పెద్ద పెద్ద సినిమాలతో పాటు, చిన్న చిన్న సినిమాలను నిర్మించడం దిల్ రాజు ప్రత్యేకత. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హిందీ రీమేక్ వకీల్ సాబ్ నిర్మాణంలో ఉండగానే మరో చిన్న సినిమాను దిల్ ప్లాన్ చేస్తున్నాడు. 

 

IHG

 

ఇక ఈ సినిమాతో బయట హీరోని కాకుండా, తన తమ్ముడు శిరీష్ కొడుకు "ఆశిష్ రెడ్డిని" హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు 'పలుకే బంగారమాయెరా..' అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకు హుషారు ఫేమ్ శ్రీ హర్ష దర్శకత్వం వహించనున్నట్లు వినికిడి. సో ఇకనుండి దిల్ రాజుకి బయట హీరోలను బ్రతిమిలాడవలసిన పనిలేదన్నమాట..

మరింత సమాచారం తెలుసుకోండి: