శంకర్ కు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఒకటి కాకపోతే మరొకటి అన్నట్టు సమస్యలు రౌండప్ చేసి కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. ఫ్లాపుల నుంచి బయటపడ్డానికి చేస్తున్న ఇండియన్ 2 కి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇంతకీ ఇప్పుడు ఇండియన్ 2కు వచ్చిన సమస్య ఏంటో తెలుసా.. 


శంకర్ ఇండియన్ 2 సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. రోబో తర్వాత ఆ రేంజ్ హిట్ లేని శంకర్, ఈ మూవీతో మళ్లీ అదరగొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఈ సినిమా షూటింగ్ నుంచే శంకర్ ని తిప్పలు పడుతోంది. ఒకటికాకపోతే మరొకటి అన్నట్టు సమస్యలు చుట్టుముడుతున్నాయి. 

 

ఇండియన్ 2 సెట్స్ లో ఈ మధ్యనే ఓ యాక్సిడెంట్ జరిగింది. క్రేన్ ఆపరేటర్ తప్పిదంతో ముగ్గురు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సహా ముగ్గురు చనిపోయారు. 10మంది గాయపడ్డారు. ఈ ఘటనతో టీమ్ మొత్తం డిసప్పాయింట్ అయింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ బాధ నుంచి కోలుకుంటున్న ఇండియన్ 2కు కరోనా షాక్ ఇస్తోంది. 


ఇండియన్ 2 ఈ నెలలో షూటింగ్ కోసం ఫారెన్ వెళ్లాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఇండియన్ 2 ఫారెన్ షెడ్యూల్ ని వాయిదా వేసుకుంది. ఇప్పటికే లేట్ అయ్యిందంటే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ మరింత లేట్ అవుతోంది. ఈ వాయిదాలు శంకర్ టీమ్ ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయట. మరి షూటింగ్ లోనే ఇన్ని నొప్పులు పడుతోన్న ఇండియన్ 2 శంకర్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

 

మొత్తానికి శంకర్ కు అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మొన్నటికి మొన్న క్రేన్ కూలిన ఘటనలో ముగ్గురు చనిపోగా.. ఆ విషాదం ఆయనకు నిద్రలు లేని రాత్రులు గడిపేలా చేస్తోంది. ఇపుడు కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: