కొంతమందికి బ్లాక్ బస్టర్ వచ్చినా సరైన ఆఫర్స్ రావట్లేదు. ఎంతో కష్టపడితే గానీ.. బిజీ కాలేకపోతున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఒక్క సినిమా రిలీజ్ కాకముందే వరుస అవకాశాలు అందుకుంటోంది. యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ గా మారుతోంది. మరి ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే బిజీ అవుతున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా..?

 

అమృత అయ్యర్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ పట్టేస్తోంది. ప్రస్తుతం ప్రదీప్ తో కలిసి 30రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేస్తోన్న అమృత డైరీలో రెండు తెలుగు సినిమాలు చేరాయి. 

 

విజయ్ విజిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది అమృత. ఈ మూవీలో ఫుట్ బాల్ ప్లేయర్ గా మంచి మార్కులు కొట్టేసింది. ఈ పెర్ఫామెస్స్ కే ఫిదా అయిన మేకర్స్ వరుస సినిమాలు చేస్తున్నారు. రామ్ రెడ్ సినిమాలో ఇలాగే ఆఫర్ వచ్చింది. రీసెంట్ గానే నాగశౌర్యతో కలిసి నటించేందుకు ఒకే చెప్పింది. సో ఈ లిస్ట్ చూస్తే అమృత త్వరలోనే స్టార్ జోన్ లో అడుగుపెట్టేలా కనిపిస్తోంది. 

 

మొత్తానికి అమృత అయ్యర్ నక్కతోక తొక్కినట్టుంది. అందుకే తన మొదటి సినిమా రిలీజ్ కాకపోయినా వరుస అవకాశాలు అందుకుంటూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. యంగ్ హీరోలకు బెస్ట్ ఛాయిస్ అయిన ఈ అమ్మడు తెలుగులో వరుస ఛాన్స్ లు అందుకుంటోంది. 

 

అమృత అయ్యర్ యువకుల కలల రాణిగా మారిపోయింది. అందుకే సీనియర్ హీరోయిన్లకు దక్కని బంపర్ ఆఫర్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇవేకాదు ఇంకొన్ని సినిమాలు సైతం ఈమె కోసం వెయిట్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇన్ని అవకాశాలు అందుకుంటున్న ఈ యంగ్ బ్యూటీ కరెక్ట్ గా సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: