టాలీవుడ్లో ఇపుడు సీనియర్ హీరోలు హీరోయిన్ల కొరత ఎదుర్కొంటున్నారు. అప్పట్లో అరవయ్యేళ్ళ ఎన్టీయార్ కి పదహారేళ్ళ శ్రీదేవి దొరికింది. అలాగే ఏయన్నార్ వంటి హీరోలు కూడా పడుచు భామలతో ఆడీ పాడారు. ఇపుడు కాలం మారింది. అరవయ్యేంటి, యాభైయేళ్ళ హీరోలకే నో చెప్పేస్తున్నారు. కాస్తా డిమాండ్ తగ్గితే ఏజ్ లో  ఉన్నా కూడా మేం చేయం వద్దు అంటున్నారు.

 

ఓవైపు కొడుకులు హీరోలుగా ఉంటే తండ్రులు ఇంకా అమ్మాయిల‌తో డ్యూయెట్లు పాడడం ఒక్క టాలీవుడ్లోనే కనిపిస్తోంది. ఈ ధోరణికి స్వస్తి పలికితే టాప్ ఫోర్ హీరోలకు మంచి పాత్రలు వస్తాయి. అలాగే, హీరోయిన్ల కొరత తప్పుకుంది. టాలీవుడ్లో మంచి కంటెంట్ ఉన్న మూవీస్ కూడా వస్తాయని అంటున్నారు.

 

తమిళంలో మోహన్ లాల్. మమ్ముట్టి, తమిళనాట సీనియర్ హీరోల మాదిరిగా కధనే నమ్మి సినిమాలు చేస్తే సీనియర్ హీరోలు తమ ఇమేజ్ ని కాపాడుకుంటూనే మరి కొన్నాళ్ళు వెలిగిపోవచ్చు అంటున్నారు. ఇపుడు బాలయ్య ఆ రూట్లోకి వచ్చాడా అన్న మాట కూడా ఉంది. ఎందుకంటే బాలయ్య తన వయసుకు తగిన ఒక వ్రుధ్ధ పాత్రను కొత్త చిత్రంలో పోషించేందుకు రెడీ అవుతున్నారుట.

 

ఆయన అరవయ్యేళ్ళ ముసలివాడిగా, కుటుంబ పెద్దగా నటించేందుకు రెడీ అవుతున్నారుట. మరి హీరోయిన్లు దొరకక విసిగి ఇలాంటి కధకు ఒప్పుకుంటున్నారో లేక నిజంగా వయసుకు తగిన పాత్రలలోకి ట్రాన్స్ ఫర్  కావాలనుకుంటున్నాడో తెలియదు కానీ బాలయ్య తన సినిమాను పట్టాలెక్కిస్తే గుడ్ డెసిషన్ అంటారంతా.

 

అదే విధంగా మిగిలిన హీరోలు కూడా హుందాగా మంచి పాత్రలు, సపార్టింగ్ రోల్స్ వేస్తే ఇండస్ట్రీకి మళ్ళీ గత వైభవం వస్తుందని అంటున్నారు. లేకపోతే హీరోయిన్ల కోసం వేటలు, వారు నో చెప్పడాలు, మళ్ళీ కధ మామూలుగానే  ఉంటుంది. చూడాలి ఈ చేంజి ఎంతవరకూ వెళ్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: